Revanth Reddy : మంత్రి ప్రశాంత్ రెడ్డిని జైల్లో పెడతాం-రేవంత్ రెడ్డి

కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర నిజామాబాద్ ప్రజలది అని రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డైరీ రాసి పెట్టాలన్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిద్దాం అన్నారు.

Revanth Reddy : మంత్రి ప్రశాంత్ రెడ్డిని జైల్లో పెడతాం-రేవంత్ రెడ్డి

Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. నిజామాబాద్ లో ఆయన యాత్ర సాగింది. అధికారపక్షం బీఆర్ఎస్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపైనా నిప్పులు చెరిగారు. బాల్కొండలో రోడ్లు చూస్తే బాధేస్తుందన్న రేవంత్ రెడ్డి.. మంత్రిగారిని బైక్ కి కట్టి రోడ్డుపై ఈడ్చుకెళితే బాటసారుల బాధలు అర్థమవుతాయన్నారు. ఏమీ చేయనప్పుడు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉండి ఏం లాభం అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉండి.. నీకు ఓట్లు వేసిన నీ నియోజకవర్గ ప్రజలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే దద్దమ్మవి అనకపోతే నిన్ను ఏమనాలి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇలాంటి రోడ్లు నేను ఎక్కడా చూడలేదు, ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి కాలుకి తాడు కట్టి బైక్ కి కట్టి రోడ్ల మీద ఈడిస్తే వీపులు చెక్కల్ చెక్కలై తోలు ఊడితే, అప్పుడు కానీ, ఈ రోడ్ల సమస్య మంత్రి ప్రశాంత్ రెడ్డికి అర్థం కాదని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర నిజామాబాద్ ప్రజలది అని రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డైరీ రాసి పెట్టాలన్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిద్దాం అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిపైనా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కు ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అని విమర్శించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇవ్వని వ్యక్తి మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

2018లో రూ.62 కోట్లతో అమరవీరుల స్థూపం కడతామన్నారు, ఐదేళ్లలో బడ్జెట్ రూ.200 కోట్లకు పెరిగింది, ఇందులో రూ.50 కోట్లు ప్రశాంత్ రెడ్డి కమీషన్లు దండుకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ద్రోహి మంత్రి ప్రశాంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం కాంట్రాక్టులపై విచారణ జరిపిస్తామన్నారు. అలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతిని నిరూపిస్తామని, ఆయనను జైల్లో పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత

”మంత్రి వేముల సర్పంచ్ కి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ. ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ఇంట్లో ఊడిగం చేస్తారు. అమరవీరుల స్థూపం నిర్మాణం ఆలస్యం చేయడంతో పాటు బడ్జెట్ ను పెంచి మంత్రి వేముల కమీషన్ తీసుకున్నారు. మంత్రి వేముల చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా” అని రేవంత్ రెడ్డి  ధ్వజమెత్తారు.