Revanth Reddy In Lakshmapur : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తాం-రేవంత్ రెడ్డి
ఈ ఊరి నుండే కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారు. కానీ ఈ ఊరిలోనే భూముల రికార్డ్ చక్కగా లేదు. రైతుబంధు, రైతు బీమా అందటం లేదు.

Revanth Reddy In Lakshmapur : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష్మాపూర్ గ్రామంలో రచ్చబండలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఊరి నుండే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారు, కానీ ఈ ఊరిలోనే భూముల రికార్డ్ సక్కగా లేవన్నారాయన. ఈ గ్రామంలో రైతుబంధు, రైతు బీమా అందటం లేదన్నారు. పిల్లల పెళ్లిలకు అమ్ముకుందాం అంటే అమ్ముకునే పరిస్థితి లేదని వాపోయారు రేవంత్ రెడ్డి.
”సీఎం కేసీఆర్.. ఈ గ్రామన్ని ఐదేళ్ల కింద దత్తత తీసుకున్నారు. ఈ గ్రామం నుంచి ధరణి పోర్టల్ ప్రారంభించారు. కానీ, లక్ష్మాపూర్ గ్రామ రెవెన్యూ నక్ష్య లేదు. 582 మందికి పాస్ బుక్ లేదు. రైతుబంధు లేదు, రైతుబీమా లేదు. అధికార యంత్రాంగానికి పదే పదే చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదు.(Revanth Reddy In Lakshmapur)
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
మంత్రి మల్లారెడ్డి అచ్చొసిన ఆంబోతులా తయారయ్యాడు. రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాలు కాజేశాడు. మూడు చింతలపల్లి, కేశవాపూర్ లో మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు అగ్గువకు కాజేశాడు. లక్ష్మాపూర్ లో కుమ్మరి ఎల్లవ్వ ఇంటి ముంచి కేసీఆర్ ఫాంహౌస్ కు రోడ్డు వేసుకున్నారు. ప్రభుత్వం ఆమెకు ఇళ్లకు డబ్బు మంజూరు చేయకపోతే.. కాంగ్రెస్ తరపున కట్టించి ఇస్తాం.
12 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తాం. ఈ ప్రభుత్వం.. వడ్లు కొనక దళారులకు వదిలేసింది. కాంగ్రెస్ వచ్చాక.. వడ్లను 2,500 రూపాయలకు కొంటాం. వరంగల్ డిక్లరేషన్ మేరకు ధరలు చెల్లించి పంట కొనుగోలు చేస్తాం. సిటీ చుట్టూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తాం.(Revanth Reddy In Lakshmapur)
Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?
వరంగల్ డిక్లరేషన్ తర్వాత.. 16 రోజులకు కేసీఆర్ ఢిల్లీకి పోయారు. రాష్ట్రంలో 84వేల మంది రైతులు చనిపోతే ఎవర్నీ పలకరించ లేదు. మన పన్నులతో వచ్చిన పైసలు తీసుకెళ్లి పంజాబ్ లో పంచుతున్నారు. కేసీఆర్ కు ఎంతసేపు రాజకీయం తప్ప ప్రజల సమస్యలు పట్టవా” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
CM KCR Distribute Cheques : పంజాబ్ రైతులు, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం
పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ”అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి… ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్.. పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్
- ఈడీ విచారణ పేరుతో రాజకీయం చేస్తున్నారు
- Revanth Reddy On Undavalli : ఉండవల్లి.. కేసీఆర్ హనీ ట్రాప్‌లో పడ్డారు-రేవంత్ రెడ్డి
- Revanth Reddy Warns BJP : మిత్తితో సహా చెల్లిస్తాం, జైలుకెళ్లక తప్పదు- బీజేపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ