Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతల ఇంటికి రేవంత్

రేవంత్‌ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.

Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతల ఇంటికి రేవంత్

Revanth Reddy

Revanth Reddy : ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది.. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.

పార్టీలో విబేధాలను పరిష్కరించుకొనేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే..సీనియర్ నేతల ఇంటికి వెళ్లారు. జానారెడ్డి, షబ్బీర్ ఆలీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు రేవంత్ ను అభినందించారు. వీరి మధ్య పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లనున్నారు రేవంత్.

టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ ను ఎంపిక చేయొద్దంటూ..కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా ఈ పదవి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. చివరకు అన్ని పరిణామాలు చూసుకున్న అనంతరం రేవంత్ వైపే…మొగ్గు చూపింది అధిష్టానం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరువాత సారధి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగింది.. అనేక సార్లు వాయిదా పడ్డ నియామకంపై ఎట్టకేలకు తేల్చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం.. సీనియర్లు వ్యతిరేకిస్తున్న అధిష్టానం రేవంత్‌ వైపే మొగ్గు చూపింది. మరి రానున్న రోజుల్లో రేవంత్ తో సీనియర్ నేతలు కలిసి పనిచేస్తారా ? లేదా ? అనేది చూడాలి.