Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ |Rewanth Reddy's open letter to CM KCR on two issues

Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదా...

Revanth reddy: జయశంకర్  సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth reddy: టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని రేవంత్ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని అన్నారు. ఆ ఊరిలో కనీస మౌలిక సదుపాయాలకు లేకపోవటం దురదృష్టకరం అన్నారు.

Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి

ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ హోదా ఆ గ్రామానికి ఇవ్వకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కంపేటను ఇంకా రెవెన్యూ విలేజ్ గా గుర్తించలేదంటే మీ మనస్సులో ఆ పెద్దమనిషి మీద ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉందో అర్ధమవుతుందంటూ సీఎం కేసీఆర్ తీరును విమర్శించారు. అక్కంపేట ఇప్పటికీ పెద్దాపూర్ విలేజ్ పరిధిలోనే కొనసాగుతుండటం క్షమించరాని అంశమన్నారు. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళిత జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని రేవంత్ న్నారు. దళితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్కంపేట ఊరికి మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదుని, పల్లె ప్రగతితో ఎన్నో అద్భుతాలు సృష్టించాం, మన పల్లెలు దేశానికి ఆదర్శం అంటూ ఉపన్యాసాలు చెప్పే మీరు.. సాక్షాత్తూ జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేదంటే పల్లె ప్రగతిలోని డొల్లతనం అర్థమవుతోందని సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ ప్రస్తావించారు. అక్కంపేటలో సార్ పేరిట స్మృతి వనం నిర్మించాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి

అదేవిధంగా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమైందని, ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని రేవంత్ లేఖలో ప్రస్తావించారు. ఓఆర్ఆర్ కోసం కూడా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైందని, ఫలితంగా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఇందులో అధిక శాతం మంది రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులేనని, అభివృద్ధి ముసుగులో భూముల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆ చిన్న, సన్నకారు రైతుల జీవితాలను ధ్వంసం చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ చూస్తు కూర్చోదంటూ సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సంబంధిత జీవోను వెనక్కి తీసుకుంటునట్లు స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లేకుంటే ఆ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా విరామంలేని పోరాటం సాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

×