CM KCR : తెలంగాణ పండించే వడ్లను కొంటరా ? కొనరా ? సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న

గత ఏడున్నరేండ్లుగా ఎన్ని బాధలు పెట్టినా...ఈ రాష్ట్రాన్ని ఆదుకోలేదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.

CM KCR : తెలంగాణ పండించే వడ్లను కొంటరా ? కొనరా ? సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న

Indirapark

Telangana Paddy Procurement: తెలంగాణ రాష్ట్రం పండించే వడ్లను కొంటరా ? కొనరా ? వడ్లు కొంటరా ? కొనరా ? అని తాను స్వయంగా..కేంద్ర మంత్రితో అడగడం జరిగిందని, ఎన్ని రోజులైనా..అక్కడి నుంచి స్పందన లేదని ఇలా…50 రోజులు గడిచిపోయిందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. సమయం వచ్చింది…గత ఏడున్నరేండ్లుగా ఎన్ని బాధలు పెట్టినా…ఈ రాష్ట్రాన్ని ఆదుకోలేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ఇతరత్రా విషయాలను ఆయన వెల్లడించారు.

Read More : Maha Dharna TRS : కేంద్రంతో సమరానికి సై, ఆరంభం…మాత్రమే..అంతం కాదు – సీఎం కేసీఆర్

ధనవంతమైన రాష్ట్రం కాబట్టి..ఓపికతో ఉన్నామన్నారు. ఎవరి మెడలు ఎవరు వంచాలి ? ఎఫ్ సీఐ ఎక్కడుంది ? దేశాన్ని పాలించే బీజేపీ పార్టీ అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడుతోందని దుయ్యబట్టారు. 2021, నవంబర్ 18వ తేదీ…గురువారం వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన మహా ధర్నా ఇందిరాపార్క్ లో కొనసాగుతోంది. ఈ ధర్నాకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను  ఎండగట్టారు.