Air Pollution : హైదరాబాద్ లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం..డేంజర్ జోన్ లో నగరం..!

మీకు సిగరెట్ తాగే అలవాటుందా? ఉంటే మానుకోండి. సింపుల్‌గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు.

Air Pollution : హైదరాబాద్ లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం..డేంజర్ జోన్ లో నగరం..!

Hyderabad

air pollution in Hyderabad : మీకు సిగరెట్ తాగే అలవాటుందా.? ఉంటే మానుకోండి. సింపుల్‌గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే.. మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు. ఇందుకు.. గాలిలో రోజురోజుకు పెరిగిపోతున్న పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్సే కారణం. విస్తృత పరిశోధనల తర్వాత.. పీఎం 2.5 కాలుష్య కారకాలు క్యూబిక్ మీటర్‌కు 35 మిల్లీగ్రాములుగా నమోదవుతున్నాయి. ఫ్యాక్టరీలు, మండే ఇంధనాలు, భారీ లోహాల లాంటి వాటితో విడుదలవుతున్న సూక్ష్మ రేణువులు.. ఒక సిగరెట్ తాగటానికి సమానమని తేలింది.

ఇదంతా చూస్తుంటే.. ఇప్పటికిప్పుడు భూకంపాలు రాకపోయినా.. సునామీలు ముంచెత్తకపోయినా.. హైదరాబాద్ మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉంది. మహా నగరంలో ఉన్న వాయువే.. ప్రజల ఆయువు ప్రమాణాలను తగ్గిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. అనేక వ్యాధులకు కారకమవుతోంది. మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. పదహారేళ్ల తర్వాత.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్‌కు సంబంధించిన కొత్త గైడ్‌లైన్స్‌ రిలీజ్ చేసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. హైదరాబాద్‌ గాలిలో ఉండే ప్రమాదకర రేణువుల స్థాయి.. నిర్దేశిత పరిమితి కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. ఇదే.. ఇప్పుడు ఆందోళన రేపుతోంది.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు

గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ రేణువుల స్థాయిని బట్టి.. కాలుష్యాన్ని నిర్ధారిస్తారు. గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పీఎం 10 అని రెండు రకాల కాలుష్య కారకాలుంటాయి. పీఎం 2.5 అంటే.. 2.5 మిల్లీ మైక్రాన్ల మందం కలిగిన ప్రమాదకరమైన రేణువులు. వీటినే దహన రేణువులని పిలుస్తారు. ఏవైనా వస్తువులను కాల్చినప్పుడు గాలిలోకి చేరే మసి, లోహ కణాలు.. ఈ కేటగిరీలోకి వస్తాయి. పర్టిక్యులేట్ మ్యాటర్ 10 అంటే.. 10 మిల్లీమైక్రాన్ల మందం ఉన్న ప్రమాదకరమైన రేణువులు. దుమ్ము, ధూళీ, పూల పుప్పొడి, బూజు రేణువులన్నీ.. ఇందులోకి వస్తాయి. ఈ పీఎం 2.5, పీఎం 10 కంటే ఎక్కువ ప్రమాదకరం. గాలిలో.. ఈ రెండింటి స్థాయి అధికంగా ఉంటే.. క్రమంగా ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

గాలిలో ఉండే పీఎం 2.5, పీఎం 10 కారకాలను పీల్చడం వల్ల.. శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు తేల్చారు. అలాగే.. ఆస్తమా, ముందస్తు ప్రసవాలు, శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, డిప్రెషన్, సిజోఫ్రెనియా, డయాబెటిస్, గుండెపోటు, లంగ్ క్యాన్సర్ లాంటి అనేక వ్యాధులు సంభవిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కొన్నేళ్లుగా.. ప్రజల్లో ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు.. ప్రమాదకరమైన కాలుష్య కారకాలే కారణమంటున్నారు. ఇదొక్కటే కాదు.. జనాల్లో అలర్జీ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. వాటి ఫలితంగా.. మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున.. ఎలాంటి లక్షణాలు కనిపించినా.. ముందస్తు చికిత్స తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

CMRF Case : 10టీవీ చేతిలో సీఎంఆర్ఎఫ్ కేసు రిమాండ్‌ రిపోర్ట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. యాన్యూవల్ సేఫ్ లిమిట్‌ను.. పీఎం 2.5ని క్యూబిక్ మీటర్‌కు 5 ఎంజీగా మార్చింది. పీఎం 10ని.. క్యూబిక్ మీటర్‌కు 15 ఎంజీగా అప్‌డేట్ చేసింది. పదహారేళ్ల తర్వాత సవరించిన గైడ్ లైన్స్ ప్రకారం.. హైదరాబాద్ గ్లోబల్ స్టాండర్ట్స్‌ని చేరుకోవడం కష్టమనిపిస్తోంది. ఎందుకంటే.. సిటీలో గతేడాదే పీఎం 2.5 యావరేజ్.. క్యూబిక్ మీటర్‌కు 35ఎంజీగా, పీఎం10 యావరేజ్.. 81ఎంజీగా నమోదైంది. ఇది.. డబ్ల్యూహెచ్‌వో సూచించిన సేఫ్ లిమిట్ కంటే.. ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. వీటిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. మనం ఎంత డేంజర్‌లో ఉన్నామో! పీఎం 2.5 లెవెల్స్ ఎక్కువగా ఉండటం.. అందరికీ ప్రమాదకరమైన విషయమేనని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలు.. ఎప్పుడో గ్యాస్ ఛాంబర్లుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. 2005లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన మార్గదర్శకాలను భారత్ పట్టించుకోలేదు. ఇప్పుడు సవరించిన గైడ్ లైన్స్‌ని కూడా సీరియస్‌గా తీసుకోకపోతే.. రాబోయే కొన్నేళ్లలోనే.. పెద్ద ఎత్తున ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో బయటకు రావడం కూడా కష్టంగా మారుతుందంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. అప్పుడు.. హైదరాబాద్‌లో ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Compensation : ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ రూ.50 వేల పరిహారం

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సవరించిన పరిమితులు, కాలుష్య కారకాలు.. మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనే వాదనను బలపరుస్తున్నాయి. పీఎం 2.5, పీఎం 10.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనటానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో.. కొందరు వాహన ఉద్గారాలను నిందిస్తుండగా.. మరికొందరు శిలాజ ఇంధన దహనాలే కారణమంటున్నారు. ఏదేమైనా.. హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశం మొత్తం.. ప్రధాన కాలుష్య కారకాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన సమయమైతే వచ్చింది.