Ranga Reddy : ఘోరరోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిన ఇద్దరు వ్యక్తులు.. వీడియో

రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని నాగర్ గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుడు బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఫోర్ వీలర్ ఢీకొంది.

10TV Telugu News

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని నాగర్ గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుడు బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఫోర్ వీలర్ ఢీకొంది. దీంతో ఇద్ద‌రు యువ‌కులు గాల్లో ఎగిరిప‌డ్డారు. ఈ ప్రమాదం నాగ‌ర్‌గూడ బ‌స్టాప్ వ‌ద్ద‌ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.

Read More : JNBY : ‘భారతీయులను కాల్చి చంపుతా’.. చైనా కంపెనీ ఉన్మాదం.. చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు

గాయ‌ప‌డ్డ యువ‌కుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

Read More : Hyderabad : భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఘర్షణ.. 22 రోజుల ప‌సికందు మృతి