డబ్బులు కట్టించుకొని పేషెంట్‌ను పట్టించుకోని ప్రైవేట్ ఆస్పత్రి…అంబులెన్స్ లోనే మహిళ మృతి

డబ్బులు కట్టించుకొని పేషెంట్‌ను పట్టించుకోని ప్రైవేట్ ఆస్పత్రి…అంబులెన్స్ లోనే మహిళ మృతి

Woman killed in ambulance : హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఓ బాధితురాలిని అంబులెన్స్‌లోనే వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. డబ్బులు కట్టించుకొని.. పేషెంట్‌ను పట్టించుకోలేదని ఆరోపిస్తూ..బాధితురాలి బంధువులు హాస్పిటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా.. ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరికొండకు చెందిన నిగ్గుల కొమరమ్మ అనే మహిళ నిన్న అనారోగ్యానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చేర్చుకున్న తర్వాత గంటసేపు క్యాజువాలిటీలో ఆమెకు వైద్యం అందించారు. ఫార్మసీకి సంబంధించిన కొన్ని మందులు కూడా రాశారు.

బాధిత మహిళ బంధువులు ఫార్మసీకి వెళ్లి మందులు తీసుకొచ్చి ఇస్తున్న సమయంలో ఆ మందులకు సంబంధించిన ట్రీమ్ మెంట్ గానీ, మిగతా ట్రీమ్ మెంట్ ఇ్వవకుండా ఆమెను అక్కడే వదిలి వెళ్లడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు.

జాయిన్ చేసుకున్న తర్వాత ఎందుకు ట్రీమ్ మెంట్ ఇవ్వడం లేదని నిలదీసిన కొద్దిసేపటికే క్యాజువాలిటీలోని డాక్టర్లు, సిబ్బంది బయటికి వెళ్లారు. పరిస్థితి విషమించిందని ఎంజీఎంకు తీసుకెళ్లాలని చనిపోయిన మహిళ మృతదేహాన్ని రోహిణి ఆస్పత్రి సిబ్బంది వారి ఆస్పత్రి అంబులెన్స్ లోనే వేశారు. ఆస్పత్రిలో జాయిన్ చేసుకుని చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తున్నారని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

బందువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి బాధితుల నుంచి సమాచారం సేకరించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.