KCR Warangal : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు హాజరైన రౌడీషీటర్

సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు రౌడీషీటర్ హాజరయ్యాడు. అది కూడా కార్పొరేటర్ పేరుతో హాజరు కావడం కలకలం రేపింది. పాస్ ను కనీసం పరిశీలించకుండా.. పోలీసులు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారంటూ..ఎమ్మెల్యేను కూడా పోలీసులు ఆపేసిన సంగతి తెలిసిందే.

KCR Warangal : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు హాజరైన రౌడీషీటర్

Cm Kcr Press Meet

CM KCR Press Meet : సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు రౌడీషీటర్ హాజరయ్యాడు. అది కూడా కార్పొరేటర్ పేరుతో హాజరు కావడం కలకలం రేపింది. పాస్ ను కనీసం పరిశీలించకుండా.. పోలీసులు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారంటూ..ఎమ్మెల్యేను కూడా పోలీసులు ఆపేసిన సంగతి తెలిసిందే.

ఓ వైపు ఎమ్మెల్యేకు అవమానం జరగగా..మరోవైపు..రౌడీషీటర్ కు అందలం ఎక్కించడంపై దుమారం చెలరేగుతోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ పర్యటనలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు.

2021, జూన్ 21వ తేదీ సోమవారం వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యటన సందర్భంగా అష్టదిగ్భందనం చేశారు. అయితే..అక్కడక్కడ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఎమ్మెల్యేకు అనుమతినివ్వకుండా..రౌడీషీటర్ కు పాస్ జారీ చేయడం వివాదాస్పదమౌతోంది. జే. అనీల్ కుమార్ కార్పొరేటర్ పేరిట రౌడీషీటర్ కు పాస్ జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయం ఈ పాస్ ను జారీ చేసింది. అసలు జే. అనీల్ కుమార్ పేరిట కార్పొరేటర్ లేడని తెలుస్తోంది. రౌడీషీటర్ కు పాస్ జారీ చేయడంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.