Huge Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.4 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్‌ నుంచి వ‌చ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్‌ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

Huge Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.4 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత

Huge Gold Seized

huge gold seized : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్‌ నుంచి వ‌చ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్‌ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో భారీగా బంగారాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు స‌మాచారం అందింది.

దీంతో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఈక్రమంలో ముగ్గురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు. వారిలో ఒక ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా రూ.2,57,47,700 విలువైన 4895.000 గ్రాముల బంగారాన్ని ఎయిర్‌ కంప్రెషర్‌ లోపల పెట్టి తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్

అదే విమానం నుంచి వచ్చిన మరో వ్యక్తి తన లగేజి తీసుకుని కస్టమ్స్‌ గ్రీన్‌ చానల్‌ను దాటేందుకు యత్నించగా అనుమానం వచ్చిన అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతడి వద్ద 24 క్యారెట్ల 12 బంగారం బిస్కెట్లు లభించాయి. 1400 గ్రాములు ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని వ్యక్తిని విచారిస్తున్నారు.

మ‌రో వ్యక్తి తన లగేజితో కస్టమ్స్‌ గ్రీన్‌ ఛానెల్‌ దాటేందేకు యత్నిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా 1400 గ్రాముల 12 బంగారం బిస్కెట్లు లభించాయి. ఈ మేరకు ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4కోట్ల విలువ చేసే 7.695 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.