Praveen Kumar IPS : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్‌

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ సర్వీస్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆర్‌ఎఏస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు.

Praveen Kumar IPS : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్‌

Praveen

Praveen Kumar IPS Resigns  : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ సర్వీస్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆర్‌ఎఏస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ రెండు పేజీల లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాదాపు 26 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Read More : Book Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ ఐదింటిలో మీకు నచ్చిన మోడల్ సెలక్ట్ చేసుకోండి!

ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు ?
ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు ఉండగానే సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పదవీ విరమణ తర్వాత కొత్త ప్రయాణం మొదలు పెడతానని ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. శేష జీవితాన్ని పీడిత ప్రజల సంక్షేమం కోసం కేటాయిస్తానని చెప్పారు. తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో స్వేరోస్‌కు నాయకత్వం వహిస్తున్నారు ప్రవీణ్‌ కుమార్‌. గురుకులాలు ప్రస్తుతం సమర్థవంతమైన అధికారుల చేతిలో ఉన్నాయని, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎలాంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.

Read More :Bangarraju : కష్టమైనా కృతినే ఫిక్స్ చేశారు.. ఎంత ఇస్తున్నారో తెలుసా..!

ఎందుకు రిటైర్ మెంట్ ?
26 సంవత్సరాల పాటు ఆయన పని చేశారు. ఇంకా ఆరు సంవత్సరాల పాటు సర్వీసు ఉన్నా..వాలంటీర్ రిటైర్ మెంట్ ప్రకటించడంపై కలకలం రేపుతోంది. ఆయన అకస్మాత్తుగా రిటైర్ మెంట్ ఎందుకు ప్రకటించారనే విషయం తెలియడం లేదు. ఇక నుంచి జ్యోతిరావు పూలే, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తానని, పేద, బడుగు బలహీన వర్గాల కోసం జీవిస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అనేక కీలక పదవుల్లో ఉంటూ…ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ప్రవీణ్ కుమార్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గురుకులంలో అనేక సంస్కరణలు చేశారు. పిల్లలకు చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More : Acacia Tree : టిటిడి పరిధిలోని శేషాచలం అడవిలో అకేషియా చెట్ల తొలగింపు…ఎందుకంటే!..

పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా ?
ఆరేళ్ల పాటు సర్వీసు ఉన్నా…ఇప్పుడు వాలంటీర్ రిటైర్ మెంట్ తీసుకోవడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ? అనే చర్చ జరుగుతోంది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తానని, పూలే, అంబేద్కర్ చూపిన మార్గంలోనే తాను నడుచుకుంటానని గతంలో ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిటైర్ మెంట్ చేయడంతో..ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారా ? అనే సస్పెన్ష్ కొనసాగుతోంది.