TSRTC Driver: ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. దుస్తులు విప్పి నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్..

ఆర్టీసీ డ్రైవర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాత బస్సులతో కేఎంపీఎల్‌(మైలేజి) ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా...

TSRTC Driver: ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. దుస్తులు విప్పి నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్..

Ts Rtc Driver

TSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాత బస్సులతో కేఎంపీఎల్‌(మైలేజి) ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డీఎం కార్యాలయం వద్ద జరిగింది. నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2‌లో పనిచేస్తున్న డ్రైవర్ గణేశ్ గత పదిహేనేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల అతను నడుపుతున్న బస్సు మైలేజీ తక్కువ వస్తుండటంతో అధికారులు గణేశ్‌ను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వారంకూడా గడవకముందే మరోసారి గణేశ్‌ను డీఐ పిలిచి మైలేజ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మైలేజ్ తగ్గినందుకు డీఎంను కలవాలని సూచించారు.

TS RTC : ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..తగ్గిపోనున్న బస్సుల సంఖ్య

ఇంకేముంది.. డ్రైవర్ గణేశ్‌కు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారం గడవక ముందే కౌన్సిలింగ్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాత బస్సులు ఇచ్చి మైలేజీ ఎక్కువ రావాలంటే ఎలా వస్తాయంటూ ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. ఇంతటితో ఆగని గణేశ్.. తన ఒంటిపై బట్టలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. గణేశ్ తీరుతో ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తొటి ఉద్యోగులు గణేశ్‌ను వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం కనిపించలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై డీఎం స్పందించారు.. కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్న బాధతోనే గణేశ్ అలా చేసినట్లు తెలిపాడు.