CM KCR RTPCR Tests : సీఎం కేసీఆర్‌ కరోనా పరీక్షల ఫలితాల్లో అస్పష్టత… మ‌రోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు

ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు.

CM KCR RTPCR Tests : సీఎం కేసీఆర్‌ కరోనా పరీక్షల ఫలితాల్లో అస్పష్టత… మ‌రోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు

Rtpcr Tests Once Again For Cm Kcr

RTPCR tests once again for CM KCR : ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మ‌రోసారి ఆర్టీపీసీఆర్ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చిన‌ట్లు తెలిపారు.

యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో ఫ‌లితం నెగెటివ్‌గా వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌లో కచ్చితమైన ఫలితం రాలేదు. వైరస్ తగ్గు ముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఎంవీ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ తెలిపారు.

కేసీఆర్‌కు ఈనెల 19న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచీ కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఛాతిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, అంతా నార్మల్‌గానే ఉందని సిటీ స్కాన్‌లో తేలినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం తిరిగి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం ఎంవీ రావు నేత్రుత్వంలోని వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.