Ukraine – Singareni : సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రభావం

ఒక్క సింగరేణి మాత్రమే కాదు.. యుక్రెయిన్ ప్రభావం దేశంలోని పలు రంగాలపై కనిపిస్తోంది.

Ukraine – Singareni : సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రభావం

War Singareni(1)

Ukraine – Singareni : పెద్దపల్లి జిల్లా : తెలంగాణ సిరుల మాగాణి సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పేలుడు పదార్థాలకు వినియోగించే ఆమోనియం నైట్రేట్ .. యుక్రెయిన్ నుంచే దిగుమతి అవుతుంటుంది. రష్యా యుద్ధం నేపథ్యంలో రెండు వారాలుగా అమోనియం నైట్రేట్ సరఫరా నిలిచిపోయింది. నిల్వలు తరిగిపోతుండటంతో.. ఇపుడు అమోనియం నైట్రేట్ ముడి సరుకు కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం ముగిసినా పరిస్థితులు చక్కబడేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు కొన్ని ఏళ్లు పట్టే అవకాశాలు ఉండటంతో.. ఇష్యూపై సీరియస్ గా దృష్టిపెట్టింది సింగరేణి యాజమాన్యం.

సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం కలగకూడదని నిర్ణయించిన అధికారులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పేలుడు పదార్థాల సరఫరా కంపెనీ ప్రతినిధులతో సింగరేణి డైరెక్టర్లు బలరామ్, చంద్ర శేఖర్ సమావేశం అయ్యారు. సంస్థకు బ్లాస్టింగ్ కు అవసరమైన సామాగ్రి సరఫరా, ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నారు. పేలుడు పదార్థాల కొత్త టెండర్ విధానాన్ని చేపట్టాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని అవసరమైన బ్లాస్టింగ్ మెటీరియల్ ను ఇంపోర్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు స్పీడప్ చేసింది.

ఒక్క సింగరేణి మాత్రమే కాదు.. యుక్రెయిన్ ప్రభావం దేశంలోని పలు రంగాలపై కనిపిస్తోంది. కీలకమైన ఆయిల్ రంగంపై ఎఫెక్ట్ భారీగా ఉండబోతోందని నిపుణులు అంచనావేస్తున్నారు.

Read This : Indian Students Ukraine : ‘మాకు ఏమైనా భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీదే బాధ్యత.. ఇదే మా చివరి వీడియో’

Read This : Operation Ganga : మా పాప పేరు ‘ఆపరేషన్ గంగ’