Khairatabad : సదర్ ఉత్సవాలు…దున్నపోతు వీరంగం

హైదరాబాద్‌ సదర్‌ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో దున్నపోతు వీరంగం సృష్టించింది.

Khairatabad : సదర్ ఉత్సవాలు…దున్నపోతు వీరంగం

Sadar

Sadar Festival Khairatabad : హైదరాబాద్‌ సదర్‌ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో దున్నపోతు వీరంగం సృష్టించింది. సదర్‌ కోసం ముస్తాబు చేస్తుండగా తాడు తెంచుకుని జనంపైకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా జనం చెల్లాచెదురయ్యారు. భయంతో పరుగులు తీశారు. దున్నపోతు అక్కడున్న వారిని తరుముతూ వస్తుంటే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఇబ్బంది పడ్డారు.

Read More : YS Jagan : ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు

దాదాపు గంటసేపు నడిరోడ్డుపై దున్నపోతు హల్‌చల్‌ చేసింది. రోడ్డు పక్కన ఉన్న స్కూటీని కొంతదూరం లాక్కెళ్లింది. దున్నపోతు వీరంగంతో అక్కడున్న వాహనాలు ధ్వంసం కాగా… పలువురికి గాయాలయ్యాయి. చివరకు దాన్ని తాళ్లలో కట్టి అదుపు చేశారు. దీంతో స్థానికులు  ఊపిరి పీల్చుకున్నారు.

Read More : Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం

ఆ తర్వాత చింతల్ బస్తీ నుంచి ఖైరతాబాద్‌ సమ్మేళనానికి తీసుకొచ్చారు నిర్వహకులు. దున్నపోతు హల్‌చల్‌తో ఖైరతాబాద్‌లో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. ప్రతియేటా దీపావళి తర్వాత హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాల నిర్వహిస్తుంటారు. ఇందు కోసం ఖరీదైన దున్నలను ప్రదర్శనకు పెడతారు. వాటిని అలంకరించి ఊరేగిస్తారు. సిటీలో పలు చోట్ల సదర్ ఉత్సవాలు జరిగాయి. అయితే ఖైరతాబాద్‌ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనతో జనం కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు.