Safe Holi : హోలీ..ఆనంద కేళీ, సహజ రంగులే మేలు

రసాయన రంగుల వల్ల వెంట్రుకలు పాడై అవకాశం ఉంటుందని, కొబ్బరి లేదా బాదం నూనెలను వెంట్రకలకు పంపించాలని పేర్కొంటున్నారు. శరీరమంతా కప్పి ఉంచే దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని...

Safe Holi : హోలీ..ఆనంద కేళీ, సహజ రంగులే మేలు

Safe Holi

Safe Holi  2022 : దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నారు. హైదరాబాద్ లో యువత రంగుల్లో మునిగి తేలుతున్నారు. హలీ పండుగ కంటే ముందు.. కాముడి దహన వేడుకలను జరుపుకున్నారు. రంగులు, నీళ్లతో సమయం తెలియకుండా ఆడుతుంటారు. హోలీ రంగులను కొనుక్కొనేందుకు ప్రజలు మార్కెట్లకు వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారిపోతున్నాయి. అయితే.. మార్కెట్ లో దొరుకుతున్న రసాయన రంగులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు, నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read More : Holi 2022 : హ్యాపీ హోలీ.. మీ ప్రియమైన వారికి వాట్సాప్ హోలీ స్టిక్కర్లను పంపుకోండిలా..!

రంగులు చల్లుకొనేంత వరకు బాగానే ఉంటుందని, ఆ తర్వాతే చర్మానికి సంబంధించి వ్యాధులు వస్తాయంటున్నారు. సహజ రంగులు వాడడం వల్ల అంటువ్యాధులను నియంత్రించొచ్చని, రసాయన రంగులతో టాక్సిక్ చెడు ప్రభావం ఉంటుందన్నారు. మూత్ర పిండాల వ్యాధులు, చర్మవ్యాధులు, ఎలర్జీ వంటివి వస్తాయని వెల్లడిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించుకుండా హోలీ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఆలివ్, బాదం, కొబ్బరి నూనెల్లో ఏదో ఒకదానిని ఎంచుకుని శరీరానికి రాసుకోవాలని వెల్లడిస్తున్నారు. పెదాలకు పెట్రోలియం జెల్లీ పూసుకుంటే బెటర్ అని తెలిపారు. గోళ్లు పెద్దగా ఉంటే వెంటనే కత్తిరించుకొని హోలీ ఆడుకోవాలంటున్నారు.

Read More : Holi Telangana : హోలీ రంగ హోలీ.. చమ్మకేళిల హోలీ

రసాయన రంగుల వల్ల వెంట్రుకలు పాడై అవకాశం ఉంటుందని, కొబ్బరి లేదా బాదం నూనెలను వెంట్రకలకు పంపించాలని పేర్కొంటున్నారు. శరీరమంతా కప్పి ఉంచే దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత వరకు చేనేత వస్త్రాలు ధరించడం బెటర్ అని వెల్లడిస్తున్నారు. చర్మానికి ఒరుసుపోయి దురద, మంటలకు కారణమవుతాయని, చేనేత వస్త్రాలైతే తడిని పీల్చుకోవడమే కాకుండా.. త్వరగా ఆరతాయని చెబుతున్నారు. రంగులు, రంగు నీటి పిచికారీలు..మొత్తంగా కోలాహలం మధ్య ఆరోగ్యాన్ని మరొవద్దని సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని.. హ్యాపీగా హోలీ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.