Sai Dharam Tej : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 10న కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్‌ బైక్ స్కిడ్‌..

Sai Dharam Tej : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

Sai Dharam Tej Ghmc

Sai Dharam Tej : మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 10న కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్‌ బైక్ స్కిడ్‌ అయి అదుపుతప్పి ప‌డిపోయాడు. ఈ ఘటనలో తేజ్ కు గాయాలు అయ్యాయి. వెంట‌నే తేజ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తేజ్ కు కాల‌ర్ బోన్ ఆపరేషన్ విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. సాయిధ‌ర‌మ్ ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. అయితే రోడ్డుపై ఇసుక ఉండడంతో స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన‌ట్టు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు అధికారులు.

Booster Dose: బూస్టర్ డోస్‍‌లు అవసరం లేదని చెబుతున్న సైంటిస్టులు

ఈ ఘ‌ట‌న‌పై జీహెచ్ఎంసీ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మాధాపూర్-ఖానామెట్ రోడ్డుపై నిర్మాణ రంగ వ్య‌ర్థాలు పేరుక‌పోవ‌డంతో..అర‌బిందో క‌న్ స్ట్ర‌క్ష‌న్ నిర్మాణ సంస్థ‌పై జీహెచ్ ఎంసీ లక్ష రూపాయల జ‌రిమానా విధించింది. సెప్టెంబ‌ర్ 13న జ‌రిమానా విధించిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఒక‌టి ఇపుడు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

VK Paul : 2022 ఏడాదిలోనూ మాస్క్ ధరించడం మానొద్దు!

అపోలో ఆసుపత్రిలో ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్న సాయిధ‌ర‌మ్ తేజ్ క్ర‌మంగా కోలుకుంటున్నాడు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆస్ప‌త్రికి వెళ్లి తేజ్ ను ప‌రామ‌ర్శిస్తున్నారు. త్వ‌ర‌లోనే తేజ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం దేవాక‌ట్టా డైరెక్షన్ లో రిప‌బ్లిక్ సినిమా చేస్తున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానుంది.