TSRTC : సందేశం పంపండి సమస్య పరిష్కరిస్తాం :- సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.

TSRTC : సందేశం పంపండి సమస్య పరిష్కరిస్తాం :- సజ్జనార్

Tsrtc

TSRTC : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు వాస్తుపై కూడా దృష్టిపెట్టారు. సంస్థ నష్టాల్లో ఉండడానికి వాస్తు కూడా ఓ కారణమని సజ్జనార్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ భవన్ దక్షిణ గేటు క్లోజ్ చేసి, తూర్పు మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇక సంస్థ ఆదాయం పెంచడంతో, సౌకర్యాలపై ప్రజల నుంచే సలహాలు తీసుకునేందుకు ఓ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు సజ్జనార్.

Read More : Sai Dharm Tej : హాస్పిటల్ బెడ్‌పై నుంచే ట్వీట్.. సాయితేజ్ విక్టరీ సింబల్

ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఓ ట్విటర్‌ ఖాతాను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ అమూల్యమైన సలహాలను tsrtc.telangana.gov.in ట్విటర్ లో పంచుకోవాలని సూచించారు. ప్రయాణికుల సూచనలతో ఆర్టీసీలో మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపారు.

Read More : TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఒకటో తేదీనే జీతాలు ?