Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉంది: మోహన్ భగవత్

సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉంది: మోహన్ భగవత్

Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని “సమతామూర్తి శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులను దర్శించుకున్న అనంతరం మోహన్ భగవత్ మాట్లాడారు. రామానుజ విగ్రహ ఏర్పాటుతో భాగ్యనగరం పేరుకు సార్థకత వచ్చిందని ఆయన అన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్న మనదేశంలో వేల సంవత్సరాల నుంచే సమతా సిద్ధాంతం వినిపిస్తోందని మోహన్ భగవత్ అన్నారు. సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని మనది ఎంతో గొప్ప మాతృభూమి అని ఆయన అన్నారు.

Also read: Rayachoti District Issue: రాయచోటిని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

హిందూ ధర్మంను దెబ్బతీయలని ప్రయత్నిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనకు నష్టం చేయాలని చూస్తే వాళ్లకే దెబ్బ తగులుతుందని అన్నారు. హిందువులే 80 శాతం ఉన్న ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే అని గుర్తుచేశారు. దేశంలో నేడు రామ మందిర నిర్మాణం జరుగుతుంది, వంద కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరుతుందని మోహన్ భగవత్ అన్నారు. పరాయి దేశాలు మన ప్రతిభను చూసి అసూయపడుతున్నాయన్న ఆయన హిందువుల సామర్థ్యంతో ఎవరు పోరాటం చేసేందుకు ముందుకురారని తెలిపారు.

Also read: Karnataka Covid Updates : కర్ణాటకలో కొత్తగా 5,339 కరోనా కేసులు, 48 మరణాలు..

అహింసావాదాన్ని పాటించే హిందూ సమాజం… ఎవరితోనూ శతృత్వం పెట్టుకోదని భగవత్ అన్నారు. అందర్ని సమానంగానే కాదు.. ఆత్మ బంధువుల్లా చూడటం మన సంప్రదాయం, సంప్రదాయాలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమే అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని జాతుల మధ్య మిత్రుత్వం, బంధుత్వం ఉండాలన్నా మోహన్ భగవత్ మన ఐక్యతే మన బలమని అన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని హిందువుల నినాదం సమాజ హితం కావాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

Also read: Bike Triple Riding: మేము అధికారంలోకి వస్తే “బైక్ పై ట్రిపుల్ రైడింగ్”కు అనుమతిస్తాం: ఓపీ రాజ్‌భర్