Hyd Police Alert : పండక్కి ఊరెళుతున్నారా..సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు..

ప్రజలు తమ కాలనీల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వాచ్‌మన్‌ ఉండేలా చూసుకోవాలంటున్నారు...

Hyd Police Alert : పండక్కి ఊరెళుతున్నారా..సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు..

Police

Sankranthi 2022 : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ పట్టణం సగం ఖాళీ అవుతుంది. పిల్లలకు కూడా సెలవులు ఉండటంతో ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని స్వగ్రామాలకు తరలివెళ్తారు హైదరాబాద్‌ వాసులు. ఇదే లక్కీ ఛాన్స్‌ అంటూ దొరికినకాడికి దోచేస్తుంటారు దొంగలు. ప్రతి సంక్రాంతి పండగ సమయంలో గ్రేటర్ హైదాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఉన్నదంతా ఊడ్చేశారు. పండగను ఎంజాయ్‌ చేసి పట్టణానికి తిరిగి వచ్చినవారు.. ఇల్లు గుల్ల అవడం చూసి లబోదిబోమంటారు. అందుకే ఇలాంటి దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు.

Read More : Rythu Bandhu : రైతు సంబరాలు…వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు

ఊరు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు కచ్చితంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకే ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచనున్నారు పోలీసులు.

Read More : DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

ప్రజలు తమ కాలనీల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వాచ్‌మన్‌ ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఇక సొంతూళ్లకు వెళ్లేవారు బంగారు నగలు, నగదు ఇంట్లో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక తాము ఊరికి వెళ్లినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు పోలీసులు. ఇటీవల వరుస దోపిడిలకు పాల్పడుతున్న గుమన్ జాతి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్‌లపై పోలీసులు నిఘాపెట్టారు. గతంలో దొంగతనం కేసుల్లో పట్టుబడ్డవారి వివరాలను సేకరిస్తున్నారు. వీలైనంతవరకూ సంక్రాంతి సీజన్‌లో చోరీలకు చెక్‌ పెడాతమంటున్నారు.