Corona Telangana : ఊరెళ్లుతున్న నగర వాసులు..పల్లెల్లో కలవరం, ఎందుకో తెలుసా ?

హైదరాబాద్‌ నుంచి సంక్రాంతికి వేలాది మంది పల్లె బాట పట్టడంతో ఆయా ఏపీ, తెలంగాణలోని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు...

Corona Telangana : ఊరెళ్లుతున్న నగర వాసులు..పల్లెల్లో కలవరం, ఎందుకో తెలుసా ?

Sankranti Corona

Villagers Panic About Corona : సంక్రాంతి సమీపిస్తోంది. ప్రజలంతా ఊరెళ్లుతున్నారు. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఎయిర్‌పోర్ట్‌లకు వస్తున్నవారు ఉన్నారు. దీంతో కరోనా భయం గ్రామాలను వెంటాడుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కోరలు చాస్తుండడం, వారం నుంచి విపరీతంగా కేసులు పెరుగుతుండడంతో ఈ ఆందోళన మరింతగా ఎక్కువైంది.

Read More : Assam CM : వరంగల్‌‌లో బీజేపీ సభ..పోలీసుల భారీ బందోబస్తు

గ్రేటర్‌ హైదరాబాద్‌ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి సంక్రాంతికి వేలాది మంది పల్లె బాట పట్టడంతో ఆయా ఏపీ, తెలంగాణలోని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. కొత్తగా నమోదయ్యే కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నెల 1న తెలంగాణలో 317 కేసులు నమోదైతే 2022, జనవరి 08వ తేదీ శనివారం ఏకంగా రెండు వేల 606 కేసులు నమోదయ్యాయి.

Read More : Pregnant Woman: మంచులో అంబులెన్స్ రాలేని పరిస్థితి.. గర్భిణీని హాస్పిటల్‌కు చేర్చిన ఆర్మీ

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి, కరోనా విజృంభణతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 3న తెలంగాణలో 482 కేసులు నమోదైతే..4న ఏకంగా వెయ్యి కేసులు దాటాయి. ఆ రోజు వెయ్యి 52 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నెల 5న 15 వందల 50 కేసులు నమోదైతే..6న 19 వందల 13 మందికి కరోనా బారినపడ్డారు. 7, 8 వరుసగా రెండు రోజులు రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. 7న రెండు వేల రెండు వందల 97 మందికి పాజిటివ్ కన్‌ఫర్మ్‌ అయితే…8న రెండు వేల 606 మంది కోవిడ్ బారినపడ్డారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల 180కి పెరిగింది.