BJP MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు
సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు చేశారు.

Aravind
BJP MP Aravind : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు అయింది. సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు చేశారు.
Prophet Row: బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ
జులై 13న నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ దూషించిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ వీడియో క్లిప్‌ను కూడా సరూర్‌నగర్ పోలీసులకు అందించారు. ఈ మేరకు పోలీసులు ఎంపీ అరవింద్‌పై ఐపీసీ సెక్షన్ 504, 505(1) సీ కింద కేసు నమోదు చేశారు.