Petrol Attack : దారుణం : చెక్కుపై సంతకం పెట్టలేదని అధికారిపై పెట్రోల్ పోసిన సర్పంచ్

 నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కుబీర్ మండలం సాల్వీ గ్రామంలో ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నీకల్ అసిస్టెంట్ రాజుపై సావ్లీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పందించాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పీ బైంసాలోని ప్రెవేట్ ఆసుపత్రికి తరలించారు.

Petrol Attack : దారుణం : చెక్కుపై సంతకం పెట్టలేదని అధికారిపై పెట్రోల్ పోసిన సర్పంచ్

Petrol Attack

Petrol Attack : నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కుబీర్ మండలం సాల్వీ గ్రామంలో ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నీకల్ అసిస్టెంట్ రాజుపై సావ్లీ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పందించాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పీ బైంసాలోని ప్రెవేట్ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు రాజు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే చెక్కుపై సంతకం పెట్టకపోవడంతో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.

పెట్రోల్ దాడి అనంతరం సర్పంచ్ సాయినాథ్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా గాయపడిన రాజు బధిరుడిగా తెలుస్తుంది. అతడికి మాటలు రావని స్థానికులు చెబుతున్నారు.