Scam in Telangana: తెలంగాణలో భారీ స్కామ్.. తెలుగు అకాడమీ నిందితుడే సూత్రదారి!

తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తెలుగు అకాడమీ కేసు(Telugu academy Case) తరహాలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Scam in Telangana: తెలంగాణలో భారీ స్కామ్.. తెలుగు అకాడమీ నిందితుడే సూత్రదారి!

Scam Comes in Light at Telangana warehousing department

Scam in Telangana: తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తెలుగు అకాడమీ కేసు(Telugu academy Case) తరహాలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్ వలి సాహెబ్ ఈ భారీ స్కామ్‌కు ప్రయత్నించాడు.

తెలంగాణ గిడ్డంగుల శాఖకి చెందిన 3.98 కోట్ల రూపాయలను కాజేసే ప్రయత్నం చేసింది తెలుగు అకాడమీ కేసులో సుత్రదారులైన మస్తాన్ వలి. ఈ కేసులో సీసీఎస్ పోలీసులకు యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచి మేనేజర్ గిరీష్ కుమార్ ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గిడ్డంగుల శాఖ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు చెందిన ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లుగా పిర్యాదు అందింది.

Jobs : డీఎస్‌ఇయూలో టీచింగ్‌ పోస్టుల భర్తీ

ఇప్పటికే మస్తాన్‌వలి తెలుగు అకాడమీ స్కామ్‌తో సహా రెండు కేసుల్లో నిందితుడు. ఈ కేసుల్లోనే ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో మస్తాన్ వలి ఉన్నారు. లేటెస్ట్‌గా ఈ కేసులో మస్తాన్ వలిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. ఈ స్కామ్‌లో బ్యాంకు అధికారుల పాత్రను కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.