Telangana : ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి

తెలంగాణలో 20శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో 10రోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చన్నారు కేసీఆర్.

Telangana : ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి

Telangana

Schools and colleges open : తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విధ్యాబోధన ఉంటుందని… కోవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 20 శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో పదిరోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్‌కు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది.

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మరో 2 వారాలపాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం భావించింది. అంటే జనవరి 31 వరకు వరకు సెలవులు పొడిగించింది.

Trains Cancellation : కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

తాజాగా ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చంటూ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విధ్యాబోధన ఉంటుందని వెల్లడించింది. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు.