11నెలల తర్వాత తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు.. వారి అనుమతి ఉంటేనే స్కూల్‌లోకి ఎంట్రీ

11నెలల తర్వాత తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు.. వారి అనుమతి ఉంటేనే స్కూల్‌లోకి ఎంట్రీ

schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. కాగా, 7 నెలల ఆలస్యంగా ఇవాళ్టి నుంచి తరగతి గదులు బోధనకు సిద్ధమయ్యాయి. పాఠశాల విద్యలో 9, 10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో క్లాస్ రూమ్స్ లో టీచింగ్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9వ తరగతి, ఆపై తరగతులకు చెందిన విద్యార్థులకు తరగతి గదుల్లో బోధన పునఃప్రారంభం కానున్న తరుణంలో.. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా స్కూల్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీలలో చర్యలు తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. బడికి రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. అలాగే స్కూల్స్ లో అసెంబ్లీ, ప్రార్థనలు రద్దు చేశారు. విద్యార్థుల స్కూల్ కి వచ్చి, వెళ్లే సమయంలో భౌతికదూరం పాటించాలి. మాస్క్ మస్ట్ గా ధరించాలి. అన్న తరగతి గదుల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. ఇలా పిల్లల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అంతా మాస్క్‌ ధరించాల్సిందేనని, శానిటైజేషన్ చేసుకోవాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. టీచర్లంతా క్రమం తప్పకుండా క్లాస్‌లు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల పాటు పరిస్థితిని గమనించాక…ఇక్కట్లు లేకపోతే.. ఫిబ్రవరి 15 నుంచి 6,7,8 తరగతులను కూడా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

* తెలంగాణలో మోగిన బడి గంట
* నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు పున: ప్రారంభం
* 11 నెలల తర్వాత తెరుచుకున్న విద్యా సంస్థలు
* బడికి రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి
* కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే స్కూల్ లోకి ఎంట్రీ

* 11లక్షల 38వేల 382 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం
* స్కూల్స్ లో అసెంబ్లీ, ప్రార్థనలు రద్దు
* నేరుగా తరగతి గదికి.. ఆ తర్వాత ఇంటికే
* బడికి వచ్చి, వెళ్లే సమయంలోనూ విద్యార్థుల మధ్య భౌతికదూరం
* విద్యార్థులకు మాస్క్ మస్ట్

* అన్ని తరగతి గదుల్లో శానిటైజేషన్ కు చర్యలు
* పారిశుధ్యంపై ఫోకస్ చేసేందుకు కలెక్టర్ స్థాయిలో కమిటీలు
* ఇంటి నుంచే వాటర్‌ బాటిల్‌. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో నిబంధనలు
* గుంపులుగా చేరకుండా పూర్తి జాగ్రత్తలు
* ఇప్పటికే హాస్టళ్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు సరఫరా.