Schools Reopen: జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం.. కేబినెట్‌లో కీలక నిర్ణయం

కరోనా కారణంగా గందరగోళంగా సాగిన విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

Schools Reopen: జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం.. కేబినెట్‌లో కీలక నిర్ణయం

Schools Reopen

Schools Reopen: కరోనా కారణంగా గందరగోళంగా సాగిన విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి స్కూళ్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితిలో నేరుగా స్కూళ్లను తెరిస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్నీ కేటగిరీల విద్యాసంస్థలను రీఓపెన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గగా.. స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కేబినెట్‌లో వివరాలను అందించగా.. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేటగిరీల విద్యాసంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

వచ్చే నెల వరకు కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోండగా.. కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలంగా మారేలోపు స్కూళ్లు, కాలేజీలు అందుకు పున:ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కరోనా అదుపులోకి వస్తే వచ్చే నెల జూలైలో రోజు విడిచి రోజు పాఠశాలలు నడపాలన్నది సర్కర్ నిర్ణయంగా కూడా తెలుస్తోంది. ఈ మేరకు స్కూళ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.