ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 09:23 AM IST
ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు

విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.



వాస్తవానికి ప్రతి నెలా తొలి వారంలో జీతాలు అందాల్సి ఉంటుంది. మూడు నెలల జీతాలు ఇవ్వాలని అడిగితే..విద్యార్థులు ఇవ్వాల్సిన ఫీజు వసూలు టార్గెట్ పూర్తి చేయనందున ఇవ్వబోమని అంటున్నాయంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు ఆన్ లైన్ పాఠాల బోధనతో పాటు ఫీజు వసూలు బాధ్యతను అప్పగించాయి.
https://10tv.in/anantapur-groom-disappeared-3-minutes-after-wedding-in-kadiri/
కానీ..కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఫీజులు చెల్లించేందుకు తల్లి దండ్రులు ముందుకు రావడం లేదు. దీని కారణంగా..టీచర్లకు జీతాలు అందడం కష్టతరంగా మారిపోయింది. లాక్‌డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు జూన్‌ ఒకటి నుంచే పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో బోధనను ప్రారంభించాయి.



ఇందులో టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను సమన్వయం చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా పనిచేస్తున్నా.. వేతనానికి మాత్రం నోచుకోవట్లేదు. ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేస్తే.. స్కూళ్లు తెరిచాకే చెల్లిస్తామనే బదులొస్తోంది.

యాజమాన్యాలు టీచర్ల వేతనాలకు ఎసరు పెడుతున్నాయి. దీనిపై కొంతమంది కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినా..స్పందన కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ టీచర్లకు జీతాలు అందుతాయా ? లేదా ? అనేది చూడాలి.