South Central Railway : జులై 1 వరకు విశాఖపట్నం రైళ్లు రద్దు

ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.

South Central Railway : జులై 1 వరకు విశాఖపట్నం రైళ్లు రద్దు

Trains Cancelled

South Central Railway : ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.

విశాఖపట్నం-కాచిగూడ మధ్య నడిచే నెంబరు 08561 రైలు, విశాఖపట్నం-కడప మధ్య నడిచే 07488, విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే 02831 రైళ్లను ఈనెల 21 నుంచి 30 వరకు, రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

అలాగే ఈనెల 22 నుంచి జులై 1 వరకు కాచిగూడ-విశాఖపట్నంల మధ్య నడిచే 08562, కడప-విశాఖపట్నం మధ్య నడిచే 07487, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే 02832 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.