Special Trains : ఆది, సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Special Trains : ఆది, సోమవారాల్లో 12  ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains

Special Trains :  దసరా సెలవులు ముగియటంతో ఊళ్ళకు వెళ్లిన ప్రజలు  తిరుగు ప్రయాణాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  పండుగకు ఊరెళ్లి తిరిగివచ్చే వారి కోసం 12 అన్‌ రిజర్వుడ్‌ రైళ్లు నడిపిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ఉదయం 8.45 గంటలకు, విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.

Also Read : Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షాలు….ఈరోజు, రేపు శబరిమల దర్శనాలు రద్దు

ఇక సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య ఉదయం 9.50 గంటలకు, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 2.55 గంటలకు, కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గంటలకు, కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గంటలకు, అదేవిధంగా కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.