Telangana : 48 గంటల ముందు..మద్యం షాపులు తెరవద్దు, అనుమతికి మించి మద్యం ఉండొద్దు

మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

Telangana : 48 గంటల ముందు..మద్యం షాపులు తెరవద్దు, అనుమతికి మించి మద్యం ఉండొద్దు

Sec Election

SEC Parthasarathi : మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ కు 48 గంటల ముందు..కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు..బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు తెరొవద్దని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతికి మించి మద్యం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. 50 శాతానికి మించి మద్యం అమ్మకాలు జరిగితే..ప్రత్యేక నిఘా పెట్టాలని పార్థసారధి సూచించారు. ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి..అక్రమ మద్యం రవాణాను నివారించాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలను అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికపైనా కూడా ఆయన సమీక్షించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికల సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. కరోనా విజృంభిస్తుండడంతో… మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కరోనా సోకడంతో.. కొన్ని రోజుల నుంచీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.. హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంటినుంచే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటూ అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌, జడ్చర్ల కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఘోరంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలు జరుపవద్దనే డిమాండ్స్ వినిసిస్తున్నాయి. మహమ్మారి మరింత విజృంభించే ఛాన్స్‌ ఉండటంతో.. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎన్నికల కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కోవిడ్‌ కష్టకాలంలోనూ అధికార, విపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.