సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం

సికింద్రాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు.

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం

Fire Accident

Secunderabad fire incident : సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాదం ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గాంధీ ఆస్పత్రిలో 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యింది. మృతదేహాలను పాట్నాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాట్నాకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ లేకపోవడంతో బెంగళూరు మీదుగా తరలించే అవకాశం ఉంది. మృతదేహాలను రేపు పాట్నాకు తరలించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

శాద్వన్ స్క్రాప్ గోడౌన్‌లో చెత్త కాగితాలు ప్లాస్టిక్ కాలి మందు బాటిళ్లు సామాన్లు ఉండడంతో మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో గోడౌన్‌లో 12 మంది ఉండగా ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విచారం.. పరిహారం ప్రకటన

కాసేపటికే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 8 ఫైరింజన్లతో.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం ఐదున్నర గంటలవరకు మంటలు అదుపు చేశారు. కాగా.. చనిపోయిన వారి ఆచూకీ కోసం ఉదయం 8 గంటల వరకూ గాలించారు. 11 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో టింబర్ డిపోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను బిహార్ కు చెందిన వారిగా గుర్తించారు.

మరోవైపు బోయిగూడ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇవాళ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఈ ప్రమాదంపై పోలీస్, జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాముల పని చేస్తున్నారు అనే వివరాలు సేకరించాలని అదేశం ఇచ్చామని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరామని చెప్పారు. ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలని కోరామని తెలిపారు.

Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. కూలీలకు యజమానులు వసతి కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని తెలిపారు. రేపు ఉదయం మృతదేహాలను వారి స్వస్థలానికి తరలిస్తామని చెప్పారు. నగరంలో ఉన్న గోదాములను గుర్తించి నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కూలీల కోసం ముఖ్యమంత్రి లాక్ డౌన్ లో స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.

హైదరాబాద్‌లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి.. వాటి అనుమతులపై రివ్యూ చేశారు. మరోవైపు తరచూ గోదాంలపై దాడులు చేయాలని అధికారులకు హోం మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. హైదరాబాద్‌లోని… కాటేదాన్‌, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, బేగంబజార్‌, సిద్ది అంబర్‌బజార్‌.. ముషీరాబాద్‌, గాంధీనగర్‌, కవాడీగూడ, జీడిమెట్ల, బాలానగర్‌, చర్లపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా గోదాములు ఉన్నాయి. వీటిలో చాలా గోదాములకు పర్మిషన్‌ లేదని స్థానికులు అంటున్నారు.