Deccan Mall Demolition : వేగంగా డెక్కన్ మాల్ కూల్చివేత పనులు, బిల్డింగ్ పక్కకు ఒరగకుండా జాగ్రత్తలు

డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కూల్చివేత పనులు నిన్న రాత్రి మొదలైనా.. ఇవాళ ఉదయం ఊపందుకున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 నుంచి 6 రోజుల్లో బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు.

Deccan Mall Demolition : వేగంగా డెక్కన్ మాల్ కూల్చివేత పనులు, బిల్డింగ్ పక్కకు ఒరగకుండా జాగ్రత్తలు

Deccan Mall Demolition : సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ భవనం కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు కూల్చివేత పనులు కంటిన్యూ అవుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కూల్చివేత పనులు నిన్న రాత్రి మొదలైనా.. ఇవాళ ఉదయం ఊపందుకున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 నుంచి 6 రోజుల్లో బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు.

బిల్డింగ్ పటిష్టత 70 నుంచి 80శాతం కోల్పోయిందని అధికారులు భావిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో డెక్కన్ మాల్ మైనస్ 2 సెల్లార్స్ ని పటిష్టం చేస్తూ ఇంజినీర్లు ర్యాంప్ ని ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూల్చివేత పనులు పూర్తయ్యే వరకు అంటే దాదాపు ఐదారు రోజుల పాటు రెండు వైపులు రోడ్డును మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్ దగ్గరికి ఎవరినీ రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేత ప్రాంతానికి జనం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

Also Read..Deccan Mall Demolition : రేపటి నుంచి డెక్కన్ మాల్ కూల్చివేత పనులు.. రూ.33 లక్షలకు టెండర్

ఈ బిల్డింగ్ కూల్చిన తర్వాత 20వేల మెట్రిక్ టన్నుల శిథిలాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటి తరలింపునకు 12 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. హై రీచ్ బూమ్ క్రేన్ సాయంతో బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించారు అధికారులు.

Also Read..Hyderabad Illegal Constructions : బాబోయ్.. హైదరాబాద్‌లో లక్షకు పైనే అక్రమ నిర్మాణాలు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

రాత్రి నుంచి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి భవంతి దగ్గర చీకటి ఉండటంతో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేసి బిల్డింగ్ కూల్చివేత పనులను ప్రారంభించారు. డెక్కన్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం సంభవించి వారం రోజులు కావొస్తున్నా ఇంకా బిల్డింగ్ నుంచి పొగ వస్తూనే ఉంది. పొగకు తోడు కాలిన వేడి కూడా అలానే ఉంది. ఒకవైపు పొగ వస్తున్నా మరోవైపు కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొత్త ఏడాది మొదలై నెలైనా గడవ లేదు. అప్పుడే నగరంలో అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జనవరి 7న కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

తాజాగా సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం యావత్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 12 గంటలకు పైగానే మంటలు కొనసాగాయి. ఎన్ని ఫైరింజన్లు వచ్చినా ఆ మంటలను ఆర్పలేకపోయాయి. చివరికి ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్లందరిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రమాదం జరిగిన ఈ రెండు భవనాల్లో నిబంధనలు ఉల్లంఘించి.. అదనపు అంతస్తులను నిర్మించారు భవన యజమానులు.

ఇవి రెండు మాత్రమే కాదు హైదరాబాద్ లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు లక్షకు పైనే ఉన్నాయి. వీటిలో చాలావరకు సెట్ బ్యాక్ లు లేకపోవడం, అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులతో ఉన్నాయి. పైగా ఇవన్నీ ఇరుకు ఏరియాల్లో ఉండటంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. అయినా, అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.