Lashkar Bonalu : ప్రారంభమైన లష్కర్‌ బోనాలు..ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

లష్కర్‌ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.

Lashkar Bonalu : ప్రారంభమైన లష్కర్‌ బోనాలు..ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

Lashkar Bonalu

Lashkar Bonalu : సికింద్రాబాద్ లష్కర్‌ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని బోనం సమర్పించారు. అనంతరం మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో మహంకాళి ఆలయంలో సందడి నెలకొంది. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులంతా క్యూలైన్లలో వెళ్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ బోనాలు
లష్కర్‌ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.

అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దీంతో పలు రూట్లలలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇక రేపు రంగం నిర్వహించనున్నారు. భవిష్యవాణితో లష్కర్‌ బోనాలు పూర్తి కానున్నాయి.