Secunderabad Railway Station : ఆ 2వేల లీటర్ల డీజిల్ అంటుకుని ఉంటే..? సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తప్పిన భారీ ముప్పు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీ ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు. అపారమైన ప్రాణనష్టం కూడా తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..

Secunderabad Railway Station : ఆ 2వేల లీటర్ల డీజిల్ అంటుకుని ఉంటే..? సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తప్పిన భారీ ముప్పు

Secunderabad Railway Station (1)

Secunderabad Railway Station : 9 గంటల హై టెన్షన్ కు ఎండ్ కార్డ్ పడింది. పోలీసుల ఆపరేషన్.. సక్సెస్ అయ్యింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆల్ క్లియర్. వందల మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు.. ఆందోళనకారులందరినీ అరెస్ట్ చేశారు. లాఠీచార్జి చేయకుండానే, ఒక్కరిపైన ఒక్క దెబ్బ కూడా వేయకుండానే నిరసనకారులను అరెస్ట్ చేసి బయటకు తరలించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు, విధ్వంసకాండ కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ అల్లర్ల కారణంగా రూ.7 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది. నిరసనకారులు నాలుగు బోగీలను తగులబెట్టారని అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్లలో 30కి పైగా బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. భారీ విధ్వంసాన్ని ఆపేందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వేశాఖ చెప్పింది.

Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం : మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌..

కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీ ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు. అపారమైన ప్రాణనష్టం కూడా తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. అల్లర్ల సమయంలో రైల్వే స్టేషన్ లో 2వేల లీటర్ల డీజిల్ కలిగున్న ఇంజిన్ నిలిచి ఉంది. ఆందోళనకారులు ఆ ఇంజిన్ కు కానీ నిప్పు పెట్టి ఉంటే, ఆ రెండు వేల లీటర్ల డీజిల్ అంటుకుని ఉంటే.. ఊహకందని ఘోరం జరిగి ఉండేదని.. అపారమైన ప్రాణ నష్టం జరిగి ఉండేందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. ఈ ముప్పుని ముందే గ్రహించి, భారీ విధ్వంసాన్ని నివారించడానికే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వేశాఖ అధికారులు వివరించారు.

Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్

”ఆందోళన గురించి నిఘా వర్గాల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. భారీ విధ్వంసాన్ని ఆపేందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. నిరసనకారుల దాడుల సమయంలో స్టేషన్ లో 2వేల లీటర్ల డీజిల్ తో ఉన్న ఇంజిన్ ఉంది. దానికి కనుక నిప్పు పెట్టి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. చాలామంది ప్రాణాలు పోయి ఉండేవి. ఈ పరిస్థితి రాకుండా తప్పించేందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని” దక్షిణ మధ్య రైల్వే జీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా అన్నారు.