Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?

రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50కోట్లు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు.

Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?

Subba Rao Arrest

Subba Rao Arrest : సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో సూత్రధారి సుబ్బారావుని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 8మందికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తరలించారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు.

సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు నోరు విప్పాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో స్కెచ్ అంతా వివరించాడు. అనుచరులతో కలిసి హోటల్ లోనే విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరితో కలిసి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు తెలిపాడు. తన ఆదేశాలతోనే వాట్సాప్ గ్రూపుల్లో తన అనుచరులు ఆందోళనలకు పిలుపునిచ్చారన్నాడు. అటు ఆందోళనకారులందరికీ నరేశ్ ద్వారా ఫుడ్ అందించాడు. ప్రస్తుతం నరేశ్ పరారీలో ఉన్నాడు. రైల్వే యాక్ట్ ప్రకారం సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు డైరెక్టర్ సుబ్బారావుని అరెస్ట్ చేశారు.

Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకంతో తనకు నష్టం వచ్చినట్లు సుబ్బారావు తెలిపినట్లు తెలుస్తోంది. రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు 50కోట్ల రూపాయలు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు. ఆర్మీ ఆశావహ అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదేమో. పరీక్ష పెట్టేదేమో. వాళ్లందరికీ ఉద్యోగాలు వచ్చి సుబ్బారావుకి రావాల్సిన ఫీజులు వచ్చావేమో. కానీ, అలా కాకుండా తానే అభ్యర్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి పథకం రచిస్తే కుట్ర చేసినందుకుగాను తానే కేసులో ఇరుక్కుంటానని సుబ్బారావు ఊహించలేకపోయాడు. ఇప్పుడు రావాల్సిన ఫీజులు పోయాయి. సాయి డిఫెన్స్ అకాడమీకి ఉన్న పేరూ పోయింది. మొత్తంగా సుబ్బారావు పరువే పోయింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సికింద్రాబాద్ అల్లర్లు మొత్తం సుబ్బారావు డైరెక్షన్ లో నడిచినందు వల్ల శిక్ష ఎంతపడుతుందో తెలియదు. అసలు జైలు నుంచి బయటకు వస్తాడో లేదో కూడా ఊహించడం కష్టం. చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల మొత్తం జీవితమే తలకిందులైపోయింది. సికింద్రాబాద్ అల్లర్ల తర్వాత భయమేసి ఆవుల సుబ్బారావు గుంటూరుకి చెక్కేశాడు. కానీ, ఏ టెక్నాలజీని ఉపయోగించి అతడు విధ్వంసం రచన చేశాడో అదే టెక్నికల్ ఎవిడెన్స్ అందరినీ కటకటాల వెనక్కి నెట్టింది. దీంతో తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు అయ్యింది.

Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

కాగా, సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావుని అన్యాయంగా ఇరికించారని అన్నారు ఆయన తరపు న్యాయవాది. సుబ్బారావు దేశభక్తుడని, ఎక్స్ ఆర్మీ పర్సన్ అని తెలిపారు. సుబ్బారావుని పోలీసులు ఇబ్బంది పెట్టడం తగదన్నారు. హింసకు, ధ్వంసానికి సుబ్బారావు సహకరించలేదన్నారు. సుబ్బారావు ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లో కూడా.. సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు కాపాడే ఉద్దేశం ఉంటుంది కానీ, పాడు చేసే ఉద్దేశం ఉండదన్నారు. విచారణ పేరుతో ఏపీ పోలీసులు ఐదు రోజులు విచారించారు, కానీ ఎటువంటి ఆరోపణలు రుజువు కాలేదని చెప్పారు సుబ్బారావు తరపు లాయర్.