Secunderabad Violence Report : సికింద్రాబాద్ విధ్వంసం.. 10టీవీ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కనిపించని సుబ్బారావు పేరు

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి.(Secunderabad Violence Report)

Secunderabad Violence Report : సికింద్రాబాద్ విధ్వంసం.. 10టీవీ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కనిపించని సుబ్బారావు పేరు

Secunderabad Violence Report

Secunderabad Violence Report : సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతిలో ఉంది. రిమాండ్ కాపీలో సంచలన విషయాలు ఉన్నాయి.

Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

మొత్తం 56 మంది పేర్లను రిమాండ్ రిపోర్టులో చేర్చారు రైల్వే పోలీసులు చేర్చారు. A2 నుంచి A12 వరకు తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. 500 మందితో రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన రమేష్ పేరుని A3 గా చేర్చారు పోలీసులు.

Railway SP Anuradha : కాల్పులు జరిపింది వాళ్లే.. సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ వివరణ

ఈ నెల 17న మధ్యాహ్నం 12.10 కి స్టేషన్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కాగా, విద్యార్థులను రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు పేరు రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మరోవైపు సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీతో పాటు దాని డైరెక్టర్ సుబ్బారావు ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు ఇంటెలిజెన్స్, ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు. ఆరు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సుబ్బారావు అకౌంటెంట్ ను అకాడమీకి తీసుకొచ్చిన అధికారులు ఆయనను విచారిస్తున్నారు. అకాడమీలోని హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.(Secunderabad Violence Report)

ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్.. అగ్గి రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది.

ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ లో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది.(Secunderabad Violence Report)

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం(జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.