Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే

సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు.

Avula Subba Rao : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 10టీవీ చేతిలో సెకండ్ రిమాండ్ రిపోర్ట్.. సూత్రధారులు ఆ ఇద్దరే

Avula Subba Rao

Avula Subba Rao : దేశంలో సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతికి చిక్కింది. రెండో రిమాండ్ రిపోర్ట్ లో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు. వీరిద్దరూ సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేస్తున్న సమయంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులు కొన్ని పేర్లు చెప్పుకున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన సుబ్బారావు, శివలు విధ్వంసం చేయాలని చెప్పినట్లు అభ్యర్థులు చెప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.

Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు

హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో సుబ్బారావు, శివలు ఫోటోలను షేర్ చేశారు. అల్లర్లకు కావాల్సిన పెట్రోల్, కర్రలు, రాడ్లను సుబ్బారావు, శివలు సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపరించారు పోలీసులు. అంతేకాదు అభ్యర్థులు స్టేషన్ వరకు చేరేందుకు రవాణ సౌకర్యాలను కూడా సుబ్బారావు, శివలే ఏర్పాటు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.(Avula Subba Rao)

Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీగా తేల్చారు పోలీసులు. ఆ తర్వాత విధ్వంసం వీడియోలను అతడు గ్రూప్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ముందు పృథ్వీని ఏ12గా చేర్చిన పోలీసులు.. ఇవాళ్టి వీడియోల ఆధారంగా ఏ2గా మార్చారు. పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టైంది ఆర్మీ అభ్యర్థుల పరిస్థితి. రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేసే సమయంలో అభ్యర్థులు సెల్ఫీ వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచింది. ఆ వీడియోలు, సెల్ఫీల ఆధారంగానే పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ గ్రూపుల్లో విధ్వంసం వీడియోలు పెట్టిన హల్ చల్ చేశారు. ఆ వీడియోలే విధ్వంసకారులను అడ్డంగా బుక్ చేశాయి. పోలీసులకు ఓ ఆధారంగా మారాయి.

సైన్యంలో నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.