palvancha: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో | Selfie video released in Ramakrishna family suicide case at palvancha

palvancha: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘనటలో ఇప్పటికే సూసైడ్ నోట్ లో వనమా రాఘవ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడు రామకృష్ణ సెల్పీ వీడియో కలకలం రేపుతోంది.

palvancha: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

Palvancha : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్యను తీసుకుని హైదరాబాద్‌ రావాలని వనమా ఆర్డర్ వేశారంటూ వాపోయాడు. డబ్బు ఇవ్వగలను.. కానీ, భార్యను ఎలా ఇవ్వగలనంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని సెల్ఫీ వీడియోలో ప్రశ్నించారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘనటలో ఇప్పటికే సూసైడ్ నోట్ లో వనమా రాఘవ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడు రామకృష్ణ సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. ‘నా కుంటుంబ పంచాయితీ నేపధ్యంలో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ వద్దకు వెళితే నా భార్యను తీసుకొని హైదరాబాద్ రమ్మన్నాడు. నీ బార్యను నాదగ్గరకు తీసుకొస్తేనే నీ పని అవుతుంది..లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా నీ సమస్య తీర్చలేరు. నీ భార్యను ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే నీ సమస్య పరిస్కారం అవుతుంది..నన్ను కాదని నువ్వు ఎవరి దగ్గరకు వెళ్లినా మీ అమ్మ ఆస్తిలో చిల్లిగవ్వ నీకు రాదు. నా భార్యను వనమా రాఘవ దగ్గరకు పంపితేనే సమస్య పరిష్కారం అందుతుందని కరాకండిగా చెప్పాడు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు

‘నా 12ఏళ్ళ కాపురంలో నా భార్యను నేను ఏనాడు మోసం చేయలేదు…రాఘవ అన్న మాటలు తనకు ఇంకా తెలియదు. నాజీవితం ఎలాపోయినా పర్వాలేదు..నాలాగా వేరే కుటుంబాలు పాడు కాకూడదనే నేను నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నా..రాఘవపై రాజకీయం అండ ఉందనే బలుపు….ఆర్థిక బలుపు..ఎదుటివారి బలహీనతనాలును అడ్దుపెట్టుకొని తన పబ్బం గడుపుకుంటున్నాడు.. ఇప్పటికే రాఘవ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి…కొన్ని బయటకు రాలె..ఇలాంటి దుర్మాగుడిని వదలొద్దు…అతన్ని రాజకీయంగా ఎదగనీయకండి’…అంటూ రామకృష్ణ సెల్పీ వీడియో చేసి మరీ కుటుంభంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

×