OU Distance Education : ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ విధానం

పీజీలో ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ సైన్సెస్, ఎంకాం, ఎమ్మెస్సీ లాంటి కోర్సులను ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది పీజీలో జులై సెషన్ ప్రవేశాలకు 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

OU Distance Education : ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ విధానం

PGRRCDE

PGRRCDE : ఉస్మానియా యూనివర్సిటీ విభాగం ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ)లో సెమిస్టర్ విధానం రానుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సెమిస్టర్ విధానంలో భాగంగా పీజీ కోర్సులను నాలుగు సెమిస్టర్లుగా విభజించనున్నట్లు వెల్లడించింది.

పీజీలో ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ సైన్సెస్, ఎంకాం, ఎమ్మెస్సీ లాంటి కోర్సులను ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది పీజీలో జులై సెషన్ ప్రవేశాలకు 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

AAI Recruitment : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో ఒప్పంద ఖాళీల భర్తీ

అయితే సెమిస్టర్ విధానంలో ప్రవేశాలు ఉంటాయని నోటిఫికేషన్ లో పొందుపరుస్తామని
తెలిపారు. ఈ ఏడాది సమాచార హక్కు చట్టం, టీవీ యాంకరింగ్, బీకాం కంప్యూటర్స్ కోర్సు, పీజీ డిప్లోమా ఇన్ యోగా వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని పీజీఆర్ఆర్ సీడీఈ అధికారులు నిర్ణయించారు.

ఈ కోర్సులను ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. కాగా,
దేశ వ్యాప్తంగా దూరవిద్యలోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)ను అనుసరిస్తున్నందున
యూజీసీ సూచన మేరకు ఈ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.