Semi nude massage : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్, ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు

Semi nude massage : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్, ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు

10tv Investigation

10TV Investigation : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్.. సెక్సువల్ మసాజ్.. ఈ మూడింట్లో కామన్‌గా మసాజ్ ఉన్నా.. ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు ఉంటుంది. తామేం చేసేదీ.. ఎలా మైమరిపించేది.. ఎలా శాటిస్‌ఫై చేసేదీ.. ఇవన్నీ వివరిస్తారు స్పా నిర్వాహకులు. అంతకంటే ఎక్కువగా అందులో పనిచేసే ఫిమేల్ ఉద్యోగులే తామందించే సర్వీసులను విడమర్చి చెబుతారు. ఇంతకీ ఇదంతా నిజమేనా అంటే… హండ్రెస్ పర్సెంట్ నిజమే అని తేలింది టెన్ టీవీ పరిశోధనలో..

ప్లేస్ : హైదరాబాద్

లొకేషన్ : కొండాపూర్ కొత్తగూడ

Investigation

ఐటీ కారిడార్ : –
కొండాపూర్ అంటే హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉంటుందీ ప్లేస్.. పైగా ఐటీ కారీడార్. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టెకీలు ఇక్కడే ఉంటారు. ఉరుకులు పరుగుల జీవితంతో గజిబిజిగా ఉంటుందీ ప్రాంతం. పగలంతా ఆఫీస్… ఈవెనింగ్ కాగానే రిఫ్రెష్‌మెంట్ కోరుకునే జనం ఎక్కువిక్కడ. పనులతో అలసిపోయే శరీరాలు కాస్త విశ్రాంతిని కోరుకుంటాయి. ఆ విశ్రాంతికి కాస్త మసాజ్ తోడైతే ఆ మాజానే వేరంటూ ఊరిస్తాయి బ్యూటీ స్పా సెంటర్లు.

Massge Parlor

మొత్తం 9 బ్రాంచీలు : –
మసాజ్ సెంటర్ పేరుతో వెలిసిందే ఇషా బ్యూటీ స్పా.. కొండాపూర్ పోష్ లొకాలిటీలో ఉందీ స్పా. కొత్తగూడ ఒక్క దగ్గరే కాదు… సిటీలోని అన్ని మెయిన్ సెంటర్లలో ఇషా బ్యూటీ స్పాకు బ్రాంచులున్నాయి. అమీర్‌పేట్ టు మలక్‌పేట్.. జూబ్లిహిల్స్ టు బంజారాహిల్స్.. పటాన్‌చెరు టు పంజాగుట్ట.. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా స్పా సెంటర్లను ఓపెన్ చేసింది. సిటీలో వేరే వేరే పేర్లతో మొత్తం 9 బ్రాంచ్‌లను రన్ చేస్తోందీ బ్యూటీ స్పా. మలక్‌పేట్‌లో ఫ్లష్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌2 పార్క్ హయత్ సమీపంలో లయన్, గచ్చిబౌలి ఐసీఐసీఐ హెడ్ ఆఫీస్ సమీపంలో సెన్సెస్, ఫిల్మ్‌నగర్‌లో సెన్సెస్, కొండాపూర్ కొత్తగూడలో ఇషా పేరుతో బ్యూటీ స్పా రన్ అవుతోంది.

Massage Parlours

రెడ్ లైట్ బిల్డింగ్ : –
అయితే… బయటి నుంచి చూసేవారికి ఇదో మసాజ్‌ సెంటర్‌. కానీ లోపలికి వెళ్లి చూస్తే.. ఇదో రెడ్‌లైట్‌ బిల్డింగ్‌. స్పా ముసుగులో గుట్టుగా హైటెక్‌ వ్యభిచారం జరుగుతోంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల నివాసం ఉండేవారికి కూడా తెలియదు. అక్కడికి ఎవరొస్తున్నారో… ఎందుకొస్తున్నారో కూడా తెలియదు. అంతేకాదు అదో ఇంద్రభవనంలా కనిపిస్తుండటంతో ఎవ్వరికి అనుమానం రాదు. ఖరీదైన బిల్డింగులను అద్దెకు తీసుకుని అందులో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహించడం చాలా ఈజీ అనే అనిపిస్తుంది అక్కడి పరిస్థితులు చూస్తే. అపార్ట్‌మెంట్‌లో అంత మంది జనాలు ఉన్నా… పక్క ప్లాట్ వారికి కూడా విషయం తెలియకుండా పట్టపగలే విశృంఖలత్వం రాజ్యమేలుతుంది. ఆకలేస్తే అన్నం పెట్టరు కానీ… అలసొస్తే మాత్రం ఆయిల్ రాస్తారు. రాసలీలల్లో ముంచెత్తుతారు.

Massage Top

హై టెక్నాలజీ : –
స్పా సెంటర్ నిర్వాహకులు మొత్తం హై టెక్నాలజీనే ఉపయోగిస్తారు. కస్టమర్లకు కాల్ చేస్తారు. వాట్సప్‌లో వివరాలు పంపిస్తారు. లోకల్ అమ్మాయిలు కావాలా, లేక నార్త్ అమ్మాయిలు కావాలా అని ఆరా తీస్తారు. టేస్ట్‌ను బట్టి కత్తిలాంటి అమ్మాయిల ఫోటోలు పంపిస్తారు.. ఏ ఫిగర్‌ కావాలంటే.. ఆ ఫిగర్‌నే సెట్‌ చేస్తామంటారు. పైగా.. అంతా నిమిషాల్లో సాగే సెటప్‌.. ఇక కొత్తగా సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు సకల సౌకర్యాలతో కూడిన లగ్జరీ హౌస్‌లో అందమైన అమ్మాయిలను చూపించి ఆకర్షిస్తారు. వ్యభిచార గుట్టును రహస్యంగా సాగిస్తుంటారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఆహ్మదాబాద్.. ఇలా దేశంలోనే మెయిన్ సిటీస్‌ నుంచి అమ్మాయిలను రప్పిస్తారు.

45 నిమిషాలకు వంద రూపాయలు : –
స్పాకు వచ్చేవారికి బ్యాక్ మసాజ్, డీప్ టిష్యూ మసాజ్ ఇలా తాము చేసే సర్వీసుల వివరాలు చెబుతారు. వాటి ధర ఎంతో చెబుతారు. స్పా సెంటర్‌కు వెళ్తే.. 45 నిమిషాలకు 15వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు. గంటకు రెండు వేలు, గంటన్నరకు మూడు వేల రూపాయలు వసూలు చేస్తారు. ఇదీ స్పా నిర్వాహకులు చెప్పే లెక్క.. అయితే.. ఇక్కడే ఒక తిరకాసు ఉంది. లోపలికి వెళ్తే ఇంకా ఏం ఉంటుందో కూడా స్పా నిర్వాహకులు ముందే చెప్పేస్తారు. రిసెప్షన్‌లో కట్టే ఎంట్రీ ఫీజుకు లోపల జరిగేదానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తారు. మసాజ్‌కు మాత్రమే ఇక్కడ పే చేయాలి. లోపల వాళ్లు సపరేట్‌గా తీసుకుంటారని.. ఎంత చెబితే అంత పే చేయాలని సూచిస్తారు.

Ish Beauty

మసాజ్ చేసేందుకు యువతి : –
ఓకే అనుకున్నాక లోనికి వేళ్తే సీన్ వేరే ఉంటుంది. మసాజ్ చేసేందుకు యువతి వస్తుంది. మసాజ్ కోసం వస్తే… స్పెషల్ మసాజ్ చేసేందుకు రెడీ అనే సంకేతాలిస్తారు. అక్కడే అసలు లెక్క స్టార్ట్ అవుతుంది. వాళ్లు చెప్పే విషయాలు వింటే దిమ్మ తిరగడం ఖాయం. బయట కట్టే 15 వందలకు లెక్కే ఉండదు. ఎందుకంటే లోపల మసాజ్ చేసే అమ్మాయి.. తాను ఇచ్చే సర్వీసుకు తానే లెక్కచెబుతుంది. మసాజ్, న్యూడ్ మసాజ్, సెమీ న్యూడ్ మసాజ్, సెక్సువల్ మసాజ్ పేరుతో రకరకాల ధరలు చెబుతుంది.

బాడీ టు బాడీ : –
వాళ్లు ముట్టుకుంటే ఒకరేటు. కస్టమర్ ముట్టుకుంటే మరోరేటు. చేత్తో మసాజ్ చేస్తే మరో రేటు.. బాడీ టు బాడీ అయితే మరోరేటు. గుడ్డలుంచుకుని మసాజ్ చేస్తే మరోరేటు.. బట్టలు తీసేసి చేస్తే మరో రేటు. మసాజ్‌తో పాటు రొమాన్స్ అయితే ఒక రేటు. మసాజ్ రొమాన్స్‌తో పాటు సెక్స్ కూడా సపరేట్ రేటు.. కావాలంటే మరో అమ్మాయి అందుబాటులో ఉంటుంది. అన్నింటికీ సై అనుకుంటే… స్వర్గం అంచులదాకా తీసుకెళ్తామనే ఊరిస్తారు మసాజ్ చేసేందుకు వచ్చే యువతులు. లోకల్ అమ్మాయిలే కాదు… నార్త్ నుంచి కూడా వస్తుంటారు. వాళ్లను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి గుట్టుగా దందా సాగిస్తోంది ఇషా బ్యూటీ స్పా. అమ్మాయిలే కాదు.. పెళ్లైన మహిళలతో కూడా ఈ స్పా డీల్ కుదుర్చుకుంటుంది. కస్టమర్ల కోసం వారిని వినియోగిస్తుంది.

Read More : Spa Centers : మ..మ..మసాజ్, ఒళ్లు రుద్దడానికి ఒక రేటు.. కాళ్లు పట్టడానికి ఇంకో రేటు