HYD : 3 గంటల్లో 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన వృద్ధుడు

తమకు వయస్సు అడ్డు రాదని నిరూపిస్తున్నారు కొంతమంది వృద్ధులు. ఒకటి కాదు..రెండు కాదు...3 గంటల్లో ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు ఓ వృద్ధుడు.

HYD : 3 గంటల్లో 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన వృద్ధుడు

Safilguda

Senior Citizen Cycle 40-KMS  : తమకు వయస్సు అడ్డు రాదని నిరూపిస్తున్నారు కొంతమంది వృద్ధులు. ఒకటి కాదు..రెండు కాదు…3 గంటల్లో ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు ఓ వృద్ధుడు. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనే రిటైర్డ్ ఉద్యోగి పాండే. మల్కాజ్ గిరిలో నివాసం ఉంటున్న ఈయన వయస్సు 75 ఏళ్లు. సఫీల్ గూడ పార్క్ నుంచి చార్మినార్ వరకు, చార్మినార్ నుంచి మరలా సఫీల్ గూడ వరకు సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నారు.

Read More : Kerala : వణుకు పుట్టిస్తున్న’నిఫా’..మరో 11 మందిలో లక్షణాలు

ఆదివారం ఉదయం సైకిల్..నెత్తిపై హెల్మెట్ పెట్టుకుని తొక్కుతూ బయలుదేరారు. చార్మినార్ కు గంట వ్యవధిలో రాగా…మళ్ళీ చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా సఫీల్ గూడ పార్క్ వరకు రెండు గంటల్లో చేరుకున్నారు. మొత్తం 3 గంటల్లో 40 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి వార్తల్లో నిలిచారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యువత నడుచుకోవాలని సూచించారు.

Read More : Ikkat Shaluvas : హస్తినలో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులకు ‘ఇక్కత్ వస్త్రాల’తో సన్మానం

ఇక పాండే విషయానికి వస్తే…రైల్వేలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య కొన్ని నెలల క్రితం చనిపోవడంతో ఒంటరి అయ్యారు. అయితే..తాను ఒంటరిని అనే ఫీలింగ్ రాకుండా ఉండేందుకు సైక్లింగ్ చేయాలని నిర్ణయించారు. నగరంలో నిర్వహించిన పలు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా సైక్లింగ్ పోటీల్లో పాల్గొనడంతో మంచి నైపుణ్యం సంపాదించారు. ప్రతి రోజు 40 నిమిషాల పాటు సైక్లింగ్, ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల మేర వాకింగ్ చేస్తారు. మిగతా సమయాల్లో 7 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తారు.