Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

Cm Kcr

Telangana government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మార్చి 7వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.

Telangana : ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్

సాధారణంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అయితే టీఆర్ఎస్, బీజేపీకి మధ్య దూరం పెరగడంతో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉంటుందా..? ఉండదా? అనే విషయంపై స్పస్టత రాలేదు.

మొత్తంగా గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ సమావేశాల ప్రారంభం మొదటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో గవర్నర్ ప్రసంగం లేదనే చెప్పవచ్చు. ఈరకంగా గవర్నర్ ప్రసంగం లేకుండా తొలి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రసంగం కొనసాగుతోంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

గవర్నర్ ప్రసంగంతోపాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండు ఉండకపోయే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆశలు ఉన్నాయి. బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏ..ఏ.. వర్గాలకు పెద్ద పీఠ వేస్తారు? అనేది ఒక అంశమైతే.. గవర్నర్ ప్రసంగం లేకపోవడం మాత్రం రాజకీయాంశంగా చెప్పవచ్చు. అయితే దీనిపై గవర్నర్, బీజేపీ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

KCR: దేశ రాజకీయాల్లోకి కేసీఆర్.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్..!

అయితే అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల నుంచి నెల రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అనధికారికంగా మాత్రం తెలుస్తోంది. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే రానున్న ఎన్నికలకు ఈ బడ్జెటే ఊతమివ్వబోతుంది. అయితే అసెంబ్లీ కానీ, పార్లమెంట్ ఎన్నికలకు గానీ, ఈ బడ్జెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, జరిగే అభివృద్ధి పనులు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు.