ఆ నలుగురు.. నరరూప రాక్షసులు.. ఒంటరి మహిళలే టార్గెట్, గతంలోనూ గ్యాంగ్ రేప్‌లు.. ఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలన నిజాలు

ఆ నలుగురు.. నరరూప రాక్షసులు.. ఒంటరి మహిళలే టార్గెట్, గతంలోనూ గ్యాంగ్ రేప్‌లు.. ఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలన నిజాలు

pharmacy student kidnap gang rape case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఘట్ కేసర్ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు గురించి భయంకరమైన విషయాలు పోలీసుల విచారణలో తెలుస్తున్నాయి. ఆ నలుగురు అసలు మనుషులే కాదని పరమ నీచులు, కామాంధులు, రాక్షసులు అని తెలుస్తోంది. ఒంటరి మహిళలే వారి టార్గెట్. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులు కనిపిస్తే చాలు వారికి పండగే. వారిపై కన్నేస్తారు. ఆ తర్వాత స్కెచ్ వేస్తారు. ఆపై పక్కా పథకం ప్రకారం వారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తారు. ఈ నీచులు గతంలోనూ నలుగురిపై గ్యాంగ్ రేప్ లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫార్మసీ విద్యార్థి కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులైన ఆటోడ్రైవర్లు ఈగ రాజు, భాస్కర్, నందర్, శివలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఘట్ కేసర్ పీఎస్ లో ప్రశ్నిస్తున్నారు. అలాగే కొందరు ఆటోడ్రైవర్లు, అనుమానితులను కూడా విచారిస్తున్నారు. ఆ నలుగురు మానవ రూపంలో ఉన్న నరరూప రాక్షసులు అని పోలీసుల విచారణలో తేలింది.

ఫార్మసీ విద్యార్థినిపై ఎప్పటో నుంచి కన్నేసిన నిందితులు.. ముందుగా రెక్కీ చేశారు. ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఘట్ కేసర్ ఓఆర్ఆర్ దగ్గర మత్తుమందు ఇచ్చి వ్యాన్ లోనే సామూహిక అత్యాచారం చేశారు. చివరికి హత్య చేసేందుకు కూడా ఆ దుర్మార్గులు వెనుకాడలేదంటే వాళ్లు ఎంత కిరాతకులో అర్థమవుతుంది. కిడ్నాప్ కి ముందు.. మ్యాటర్ రెడీ అంటూ ఆటోడ్రైవర్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు.

అసలేం జరిగిందంటే..
ఫార్మసీ స్టూడెంట్ బుధవారం(ఫిబ్రవరి 10,2021) సాయంత్రం ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ నగర్‌‌‌‌ లోని తన ఇంటికి వెళ్లేందుకు రాంపల్లి చౌరస్తాలో సా.6:15కి ఆటో ఎక్కింది. కాగా, ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ నగర్‌‌‌‌ లో ఆటోని ఆపకుండా వెళ్లిన డ్రైవర్ యమ్నాంపేట్‌‌‌‌ లో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఆపకుండా స్పీడ్​గా తీసుకెళ్తున్నాడని అప్పటికే ఆమె పేరెంట్స్‌‌‌‌కు ఫోన్ చేసి చెప్పింది. భయంతో స్టూడెంట్ కేకలు వేయడంతో నిందితులు రాడ్​తో కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. యమ్నాంపేట్‌‌‌‌ శివారులోని రైల్వే ట్రాక్‌‌‌‌ దగ్గరకు తీసుకెళ్లి రేప్ చేసి, అన్నోజిగూడ దగ్గర వరంగల్‌‌‌‌ హైవేకు దగ్గరలో బాధితురాలిని వదిలేశారు.

ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి..
బాధితురాలి తల్లిదండ్రులు 100కి డయల్ చేయడంలో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌ ఆధారంగా గాలించారు. ఫార్మసీ స్టూడెంట్‌‌‌‌ బస్‌‌‌‌ దిగిన రాంపల్లి చౌరస్తా నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ నగర్‌‌‌‌, యమ్నాంపేట్‌‌‌‌, అన్నోజిగూడ వరకు సీన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అఫెన్స్‌‌‌‌ను పరిశీలించారు. టవర్‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌ ఆధారంగా రాత్రి 7.50గంటల సమయంలో గాయాలతో అన్నోజిగూడ దగ్గర పడిఉన్న బాధితురాలిని పోలీసులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్‌‌‌‌ తరలించారు.

మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత బాధితురాలి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేశారు. కిడ్నాప్‌‌‌‌, దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ పుటేజ్‌‌‌‌ ఆధారంగా యమ్నాంపేట్‌‌‌‌కు చెందిన ఆటోడ్రైవర్లు ఈగ రాజు, భాస్కర్, నందన్‌‌‌‌, శివను అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్‌‌‌‌, గ్యాంగ్​ రేప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు బుధవారం సాయంత్రం రాంపల్లి చౌరస్తాలో రెక్కీ వేసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు.