YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆమె కీలక ప్రకటన చేశారు.

YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

Ys Sharmila

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆమె కీలక ప్రకటన చేశారు.

Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇప్పటి నుంచి నా ఊరు పాలేరు.. వైఎస్ఆర్ ఫొటోతో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు. ఇకపై వైఎస్సార్ బలం మన సొంతం. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదు.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉంది. ఈరోజు నుంచి పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు. నా కోరిక కూడా. వైఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నియోజకవర్గం నుంచే మొదలు కావాలని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ వారసత్వం బిడ్డగా నాకే ఉంది. ఏ పార్టీకి సొతం కాదు అంటూ పేర్కొన్నారు.

Viral Video: మెరుపుల బండి.. ట్విటర్‌లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా

వైఎస్ షర్మిల వ్యాఖ్యలతో పాలేరు రాజకీయాలు కీలక మలుపు తిరనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. కొన్నాళ్లకు కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరు నేతల వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో నియోజకవర్గంలో వర్గవిబేధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేను పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతా, ఇదే నా నియోజకవర్గం అంటూ షర్మిల ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.