Peddi Reddy: బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ గూటికి!

హుజురాబాద్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగల పెద్ది‌రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను ఆయన వ్యతిరేకించారు.

10TV Telugu News

E.Peddi Reddy: హుజురాబాద్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగల పెద్ది‌రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను ఆయన వ్యతిరేకించారు. రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉండగా.. అప్పటి నుండే బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపించింది.

ఈటల చేరిన సమయం నుండే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. చివరికి ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పెద్దిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేయగా.. టీడీపీలో ఉన్నంత కాలం కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరగా.. ఈటల కమలం గూటికి చేరడంతో పెద్దిరెడ్డి కినుకు వహించినట్లుగా కనిపించింది.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే తాను మద్దతు ఇవ్వనని పెద్దిరెడ్డి అప్పుడే ప్రకటించగా.. ఈటల పార్టీలో చేరడంపై తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. చివరికి సోమవారం బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే, పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిగా హుజురాబాద్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి లాంటి నేత పార్టీకి దూరమవడం బీజేపీకి షాక్ అనే చెప్పాలి. అయితే.. ఈ పరిస్థితిని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

త్వరలో టీఆర్ఎస్ గూటికి పెద్దిరెడ్డి?

పెద్దిరెడ్డి బీజేపీతో బహిరంగంగానే అసంతృప్తితో ఉన్నారని వెల్లడించిన సమయం నుండే టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే నిన్నటి వరకు ఈ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. దీంతో పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటనే విషయమై స్పష్టత రాలేదు. కానీ, నేడు ఆయన బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన్ని ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొనేందుకు పెద్దిరెడ్డి ఒప్పేసుకున్నారని.. మంచి ముహూర్తం చూసుకుని కారెక్కేస్తారనే ప్రచారం కూడా తెలంగాణ రాజకీయ వర్గాలలో బలంగా జరుగుతుంది.

10TV Telugu News