Mission Bhagiratha Water : బాబోయ్.. మిషన్ భగీరథ నీటిలో మాంసపు ముద్దలు.. షాక్‌లో గ్రామస్తులు

మిషన్ భగీరథ నీటిలో మాంసం ముద్దలు దర్శనం ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందోనని తెలుసుకోవడానికి గ్రామస్తులు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లారు.

Mission Bhagiratha Water : బాబోయ్.. మిషన్ భగీరథ నీటిలో మాంసపు ముద్దలు.. షాక్‌లో గ్రామస్తులు

Mission Bhagiratha Water

Mission Bhagiratha Water : తాగే నీటిలో మాంసపు ముద్దలు.. ఏంటి షాక్ అయ్యారా? అదేంటి? తాగునీటిలో అసలు మాంసపు ముద్దలు ఎందుకు వస్తాయని సందేహం వచ్చింది కదూ. అవును.. నిజమే.. మీరు విన్నది కరెక్టే. తాగే నీటిలో మాంసం ముద్దలు వచ్చాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. మిషన్ భగీరథ నీటిలో మాంసం ముద్దలు దర్శనం ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు షాక్ తిన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తాగునీటిలో మాంసపు ముద్దలు కనిపించడం కలకలం రేపింది. అసలేం జరిగిందోనని తెలుసుకోవడానికి గ్రామస్తులు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లారు. అక్కడ తాగునీటిలో మాంసపు ముద్దులు చూసి అవాక్కయ్యారు. లక్ష్మీపురంలోని వాటర్ ట్యాంకులపై మూతలు లేవు. దీంతో పక్షులు, కోతులు అందులో పడి మృతి చెందుతున్నాయి. అందులోనే మాంసపు ముద్దలుగా మారుతున్నాయి. తాగు నీటి సరఫరాలో కూడా మాంసం ముద్దలు కనిపిస్తున్నాయి.
అసలు విషయం తెలిసి వారికి కడుపులో తిప్పినంత పనైంది. ఇన్నాళ్లు మనం తాగింది ఈ నీటినేనా అని చర్చించుకుంటున్నారు. తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.

Botsa On Amma Vodi : లక్షమందికి పైగా అమ్మఒడి కోత..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

వాటర్ ట్యాంక్ కి మూతలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులకు అర్థమైంది. అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. వాటర్ ట్యాంక్ కి పైకప్పు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం అంటున్నారు. మరీ ఇంత నిర్లక్ష్యమా అని సీరియస్ అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, వెంటనే వాటర్ ట్యాంక్ పై మూతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అవకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.