Notice To Narayana College : లాక్‌డౌన్‌లో దొంగచాటుగా క్లాసులు.. నారాయణ కాలేజీకి నోటీసులు

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు నోటీసులు పంపారు. కాలేజీకి జరిమానా విధిస్తామని అధికారులు చెప్పారు. అనధికారకంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Notice To Narayana College : లాక్‌డౌన్‌లో దొంగచాటుగా క్లాసులు.. నారాయణ కాలేజీకి నోటీసులు

Notice To Narayana College

Show Cause Notice Issued To Narayana College : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు నోటీసులు పంపారు. కాలేజీకి జరిమానా విధిస్తామని అధికారులు చెప్పారు. అనధికారకంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై టెన్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలను తనిఖీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల రాకను పసిగట్టిన కాలేజీ యాజమాన్యం ఉన్న పళంగా అక్కడి నుంచి విద్యార్థులను దొడ్డిదారిన పంపేసింది. పుస్తకాలు, బ్యాగులను క్లాస్ రూమ్ లోనే వదిలేసి విద్యార్థులు వెళ్లిపోయారు. కాలేజీలో తనిఖీలు జరిపిన అధికారులు క్లాసులు జరిగినట్టు నిర్ధారించి చర్యలు తీసుకున్నారు. కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కరోనా మహమ్మారి కాలంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులను కాలేజీలకు పంపొద్దని అధికారులు సూచించారు.