Telangana : మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసా : జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి

మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసాlనని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత కల్పించాలని కోరారు.

Telangana : మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసా : జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి

Shravani resigned from municipal chairman

Shravani resigned from municipal chairman : జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు. మూడేళ్లుగా ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నానని ఇక భరించటం నా వల్ల కాదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శ్రావణి రాజీనామా చేశారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం బహుజనవర్గాలకు చెందిన ఓ ఆడపడుచు అణచివేతకు గురి అవుతోంది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు శ్రావణి. పేరుకు మాత్రమే నేను చైర్ పర్సన్ ను కానీ పెత్తనం అంతా ఆ ఎమ్మెల్యేదే అంటూ చెప్పుకొచ్చారు. బీసీ వర్గానికి చెందిన నేను ఎదుగుతుంటే ఓర్వలేక నాపై కక్ష కట్టి మూడేళ్లుగా వేధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు శ్రావణి.

తన రాజీనామాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని శ్రావణి కన్నీరుపెట్టుకుని తెలిపారు.గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తనను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని..ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయానన్నారు. కలెక్టర్ ను కలవొద్దని ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధికి చెందిన కార్యక్రమాలే కాదు ఏ ఒక్క పని కూడా తనతో ప్రారంభించకుండా చేశారని కన్నీటితో రోదించారు. డబ్బు కావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కానీ మేం ఇచ్చులేం అని చెప్పినా వేధింపులు మానలేదని పదే పదే వేధించేవారని ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పెట్టే టార్చర్ భరించలేక చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు.

ఎన్నిసార్లు అవమానించినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లానని..పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నామని అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చెప్పినా ఎమ్మెల్యే తన వేధింపులు మానలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని..కాబట్టి నాకు భద్రత కల్పించాలని వేడుకున్నారు శ్రావణి.