TSLPRB: తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పుడంటే?

తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం పరీక్షా తేదీలను ఖరారు చేసింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, ఆగస్టు 21 తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

TSLPRB: తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పుడంటే?

Tslprb

TSLPRB: తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం పరీక్షా తేదీలను ఖరారు చేసింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, ఆగస్టు 21 తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇందుకు సంబంధించి హాల్ టికెట్స్ కోసం.. ఎస్ఐ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు జూలై 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్ టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

మొత్తం 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన విషయం విధితమే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు